చాలామంది తల్లీదండ్రులు తమకు సంతానంగా ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావిస్తారు.ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే బాగుంటుందని తల్లీదండ్రులు అనుకుంటారు.
సెలబ్రిటీలు సైతం ఇందుకు అతీతం కాదు.నాగార్జున పలు సందర్భాల్లో తనకు, అమలకు ఆడపిల్ల పుడుతుందని అనుకుంటే భార్గవ్ రామ్ పుట్టాడని వెల్లడించిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) సైతం రెండో సంతానంగా ఆడపిల్ల పుడుతుందని భావించారట.
అయితే రెండో సంతానంగా కూడా కొడుకు పుట్టడంతో ఫీలయ్యాడట.
తాజాగా తారక్ ఈ విషయాలను వెల్లడించగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కొంతమంది నెటిజన్లు తమకు కూడా ఆడపిల్ల లేదని బాధ ఉందని చెబుతుంటే మరి కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ ఆడపిల్లను దత్తత తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్, ప్రణతిలకు(Lakshmi Pranathi ) ఇష్టం ఉంటే మాత్రమే ఇలా చేయాలని చెబుతున్నారు.
ఈ కామెంట్ల విషయంలో తారక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాను షూటింగ్ డేట్ కంటే ముందుగానే మొదలుపెట్టారు.ప్రస్తుతం తారక్ పై పలు సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా తారక్, జాన్వీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జోడీ సక్సెస్ ( Janhvi Kapoor ) అయితే ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని కొంతమంది దర్శకనిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాను ఈ స్థాయికి చేరుకుంటానని అనుకోలేదని తాజాగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నారు.వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.