వ్యవసాయంలో మిగతా పంటలతో పోల్చితే వామును( ajwain ) తక్కువ శ్రమతో పండించవచ్చు.ఎటువంటి నేలలోనైనా, ఎటువంటి వాతావరణం లోనైనా వాము పంటను సాగు చేయవచ్చు.
కానీ వర్షాధారం అయితే నల్లరేగడి నేలలు( Alluvial soils ), నీటి పారుదల వసతి ఉంటే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి.మంచుతో కూడిన వాతావరణం అయితే చాలా అనుకూలమని చెప్పవచ్చు.
వర్షాధారంగా పండిస్తే ఆగస్టు నెలలో, నీటిపారుదల వసతి ఉంటే అక్టోబర్ నెలలో విత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.పంట వేసే ముందు పచ్చిరొట్ట పైర్లు వేసి పొలాన్ని కలియదున్నాలి.
లోతు దిక్కులు దున్నడం( Plowing in deep directions ) వల్ల కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.మేలురకం విత్తనాలను ఎంచుకొని ఎకరాకు కిలో చొప్పున విత్తనాలు తీసుకొని, కార్భండిజం 1గ్రా తో విత్తన శుద్ధి చేసి, 1:3 నిష్పత్తిలో ఇసుక కలిపి గొర్రుతో నాలుగు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి.
నాటిన రెండు వారాల తర్వాత ఒక తేలికపాటి నీటి తడి అందించాలి.పంట వేయడానికి ముందే పొలంలో పది కిలోల ఏరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఎకరాచొప్పున వేసుకోవాలి.ఒకవేళ నీటి వసతులు ఉంటే విత్తిన 40 రోజుల వ్యవధిలో పది కిలోల ఏరియా 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి.విత్తిన 100 రోజుల వ్యవధిలో కలుపు తీసి గోర్రుతో అంతర కృషి తో గుంటక తోలాలి.
మొక్కల ఆకులపై తెల్లని బూడిద వంటి మచ్చలు ఏర్పడితే వీటి నివారణ కోసం ఒక లీటర్ నీటిలో ఒక గ్రాము కార్భండిజమ్ కలిపి పిచికారి చేసుకోవాలి.పంట మార్పిడి చేయడం విత్తన శుద్ధి చేయడం వల్ల ఎండు తెగులు రాకుండా అరికట్టవచ్చు.వేప నూనె ఐదు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటితో కలిపి చేయడంతో లీఫ్ మైనర్ పురుగుల బెడద తగ్గుతుంది.పంట 150 రోజులలో చేతికి వస్తుంది.గింజలు గోధుమ రంగులోకి మారిన తర్వాత మొక్కలను కోయడం కానీ, పీకడం గానీ చేయాలి.ఆ తర్వాత ఒక రెండు రోజులు పొలంలో ఎండ నుంచి పంటను నూర్చుకోవాలి.