కొబ్బరి పంటను ఆశించే తెగులలో గానోడెర్మా తెగులు ( Ganoderma pest )అతి ప్రమాదకరమైనది.ఈ తెగులు పంటను ఆశిస్తే నష్టం తీవ్రస్థాయిలో ఉంటుంది.
ప్రాంతాలను బట్టి ఈ తెగులను బంకకారు తెగులు, సిగ తెగులు, ఎర్ర లక్క తెగులు, పొట్టు లెక్క తెగులు అని వివిధ పేర్లతో పిలుస్తారు.తేలికపాటి నేలలలో, నీటి ఎద్దడి అధికంగా ఉండే తోటలలో, కొబ్బరి చెట్ల వేర్లు నరికి వేయడంతో ఆ వేర్లకు గాయాల రూపంలో ఈ తెగులు పంటను ఆశిస్తాయి.
నల్ల రేగడి నేలలలో, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న తోటలలో, చెట్లు వేర్లు నరకకుండా ఉంటే ఈ తెగులు పంటను ఆశించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ముఖ్యంగా చెట్ల వేర్లకు గాయాలైనప్పుడు బూజు జాతి శిలీంధ్ర బీజాల వల్ల కొబ్బరి కి ఈ తెగులు సోకి వేర్లు అన్ని కుళ్లిపోతాయి.
ఈ తెగుల ఉదృత్తి పెరుగుతున్న క్రమంలో కాండం చుట్టూ చిన్నచిన్న పగుళ్ల నుండి ముదురు గోధుమ రంగు వంటి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు ద్రవం కనిపిస్తుంది.
![Telugu Agriculture, Ganoderma Pest, Latest Telugu-Latest News - Telugu Telugu Agriculture, Ganoderma Pest, Latest Telugu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/03/Plant-protection-methods-to-protect-coconut-crop-from-Ganoderma-pestb.jpg)
ఈ తెగుల ప్రభావంతో చెట్ల ఆకులు( tree leaves ) పసుపు రంగులోకి మారడం, కొత్త ఆకులు రావడంలో ఆలస్యం కావడం, ఆకుల సంఖ్య తక్కువగా ఉండడం, ఆకుల పరిమాణం తక్కువగా ఉండడం, అండ పుష్పాల సంఖ్య తక్కువగా ఉండడం గమనించవచ్చు.పిందెలు, కాయలు రాలిపోవడం, చెట్టు యొక్క వేర్లు దాదాపు 90% కుళ్ళి కొత్త పేర్లు రాకుండా ఉండడం జరుగుతుంది.ఈ తెగులు సోకిన చెట్లను ముందుగా పూర్తిగా తొలగించేయాలి.
ఆ స్థానంలో కొత్త మొక్కలు నాటేటప్పుడు గుంతలు చెత్త వేసి కాల్చాలి.తర్వాత అందులో పశువుల ఎరువులు, కంపోస్ట్ ఎరువులు( Compost fertilizers ), ట్రైకోడెర్మా విరిడి 50 గ్రాములు, ఒక కిలో వేపపిండి కలిపి వేయాలి.
ఎట్టి పరిస్థితులలో కూడా చెట్టు పేర్లను నరకకూడదు.తేలికపాటి నేలల్లో జనుము జిలుగా వంటి పచ్చిరొట్ల పైర్లు వేసి పూత దశలో ఉన్నప్పుడు కలియదున్నాలి.