కోల్‌కతాలోని హౌరా వంతెన చరిత్ర ఎంతో ఆసక్తిగా ఉంటుంది.ఈ వంతెన కోల్‌కతాకు గుర్తింపుగా కనిపిస్తుంది.
హౌరా వంతెన నిర్మించి దాదాపు 80 ఏళ్లు కావస్తోంది.కానీ, నేటికీ అది అలాగే ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఇది చెక్కుచెదరలేదు.డిసెంబర్ 1942లో జపాన్ బాంబు ఈ వంతెనకు కొద్ది దూరంలో పడింది.
కానీ అప్పుడు కూడా ఈ వంతెనకు ఏమీ కాలేదు.ఓడల రాకపోకలు నిలిచిపోకుండా ఉండేలా ఈ బ్రిడ్జికి రూపకల్పన బీబీసీ నివేదిక ప్రకారం పంతొమ్మిదవ శతాబ్దం చివరి దశాబ్దాలలో, కోల్‌కతా మరియు హౌరా మధ్య ప్రవహించే హుగ్లీ నదిపై తేలియాడే వంతెనను నిర్మించాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రణాళిక వేసింది.

నిజానికి ఆ కాలంలో హుగ్లీ నదిలో రోజూ అనేక ఓడలు వస్తూ పోతూ ఉండేవి.పిల్లర్లతో కూడిన వంతెన వల్ల ఈ నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి 1871లో హౌరా బ్రిడ్జి చట్టాన్ని ఆమోదించారు.హౌరా వంతెన నిర్మాణ పనులు 1936లో ప్రారంభమై 1942లో పూర్తయ్యాయి.ఆ తరువాత, ఫిబ్రవరి 3, 1943 న, సాధారణ ప్రజలు సైతం దీనిని ఉపయోగించడం ప్రారంభించారు.
ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే మూడవ పొడవైన వంతెనగా గుర్తింపు పొందింది.గురువు రవీంద్రనాథ్ పేరు మీదుగా దీనికి 1965లో రవీంద్ర సేతు అని పేరు పెట్టారు.
ఉక్కును సరఫరా చేసిన టాటాబీబీసీ నివేదిక ప్రకారం, హౌరా వంతెన నిర్మాణానికి 26,500 టన్నుల ఉక్కును ఉపయోగించారు, అందులో 23,500 టన్నుల స్టీల్‌ను టాటా స్టీల్ సరఫరా చేసింది.దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ వంతెన మొత్తం నదికి ఇరువైపులా నిర్మించిన 280 అడుగుల ఎత్తులో ఉన్న రెండు స్తంభాలపై మాత్రమే ఉంటుంది.

ఈ రెండు స్తంభాల మధ్య దూరం ఒకటిన్నర వేల అడుగులు.అంతే కాకుండా నదిలో ఎక్కడా బ్రిడ్జికి మద్దతుగా పిల్లర్ లేదు.నెయిల్స్ ఉపయోగించారుహౌరా బ్రిడ్జ్ గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, దాని నిర్మాణంలో స్టీల్ ప్లేట్లను కనెక్ట్ చేయడానికి నట్-బోల్ట్లను కాకుండా మెటల్‌తో చేసిన నెయిల్స్ ఉపయోగించారు.పొగాకు ఉమ్మివేయడం వల్ల వంతెన మందం తగ్గుతోందని 2011లో ఓ నివేదికలో వెల్లడైంది.
దీని తరువాత, వంతెన భద్రత కోసం, దాని ఉక్కు దూలాల కిందిభాగాన్ని ఫైబర్గ్లాస్తో కప్పారు.ఇందు కోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.