భగవంతుడు అలా ఆపేశారన్న అలీ.. 3000 మంది చనిపోయారంటూ?

స్టార్ కమెడియన్ అలీ ఇప్పటివరకు సినిమాలలో అంచనాలకు మించి విజయాలను సొంతం చేసుకోగా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా విజయాలను అందుకుంటానని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.వైసీపీ తరపున పదవులు పొందిన అలీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

 Ali Comments Goes Viral In Social Media Details Here Goes Viral ,star Comedian A-TeluguStop.com

జగన్ అలీకి ఎక్కడినుంచి పోటీ చేయాలని సూచిస్తారో చూడాల్సి ఉంది.జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చెయ్యడానికి కూడా సిద్ధమేనని అలీ తెలిపారు.

నేను నా పుట్టినరోజున అనాథలకు ఫ్రూట్స్ ఇవ్వడంతో పాటు వృద్ధులకు దుప్పట్లు ఇస్తున్నానని ఆయన తెలిపారు.ఎనిమిదేళ్ల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని అలీ పేర్కొన్నారు.

దర్శకనిర్మాతలు, కోఆర్టిస్టులు నా సక్సెస్ కు కారణమయ్యారని అలీ అన్నారు.బ్రతికున్న తల్లీదండ్రులే నా దృష్టిలో దైవం అని అలీ కామెంట్లు చేశారు.

వాళ్లు తిన్నా తినకపోయినా మనకు తిండి పెడతారని అలీ వెల్లడించారు.

Telugu Ali, Cm Jagan, Mecca, Pawan Kalyan-Movie

మా నాన్నమ్మ ఉర్దూ టీచర్ అని ఆవిడ వృత్తి మా ఫాదర్ కు ఇచ్చిందని ఆయన అన్నారు.మా నాన్నకు దైవ భక్తి ఎక్కువని అలీ పేర్కొన్నారు.1998లో మా ఫాదర్ మదర్ ను మక్కాకు పంపించాలని టికెట్లు తీసుకుని ముంబైకు పంపించగా జనాభా ఎక్కువైపోయారని ఆపేయాలని సౌదీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని అలీ అన్నారు.చాలా హ్యాపీగా ముంబైకు వెళ్లిన పేరెంట్స్ నిరాశతో వెనుదిరిగారని అలీ కామెంట్లు చేశారు.

Telugu Ali, Cm Jagan, Mecca, Pawan Kalyan-Movie

ఆ తర్వాత నేను తల్లీదండ్రులను తీసుకుని అజ్మీర్ వెళ్లానని అదే సమయంలో మక్కాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 3000 మంది చనిపోయారని అలీ అన్నారు.భగవంతుడు అలా ఆపేశారా అని అనిపించిందని 1999లో ఫాదర్ మదర్ మక్కాకు వెళ్లారని 2000లో ఫాదర్స్ డే రోజున మా ఫాదర్ చనిపోయారని కమెడియన్ అలీ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube