తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అపోలో హాస్పిటల్లో మరణించిన విషయం తెలిసిందే.అయితే దర్శకుడి మరణ వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
ఇలా విశ్వనాధ్ గారి మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.విశ్వనాథ్ గారి మరణం పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా కళాతపస్వి కె విశ్వనాథ్ గారి మరణం గురించి స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఇది అత్యంత విషాదకరమైన రోజు పితృ సమానులు,కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఇకలేరు అనే వార్త తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు
అలాంటి ఓ గొప్ప దర్శకుడు దర్శకత్వంలో తాను శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి అనే సినిమాలలో నటించానని తెలిపారు.మా ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధం ఉందని అంతకుమించి తండ్రి కొడుకుల అనుబంధం ఉందని, ఆయనతో గడిపిన క్షణం తనకు ఎంతో విలువైనదని తెలిపారు.43 సంవత్సరాల క్రితం దర్శకుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా
ఫిబ్రవరి 2వ తేదీ విడుదలైంది ఈ సినిమా విడుదలైన రోజున ఈయన మరణించడం బహుశా ఆ శంకరుడి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారు.విశ్వనాధ్ గారి మరణం చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి విశ్వనాథ్ గారి మరణం పై ఎమోషనల్ పోస్ట్ చేశారు.