సుకుమార్, అల్లు అర్జున్ కలిసి తీసిన పుష్ప పార్ట్ 1 ఊహించని విధంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప రాజ్ గా బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడేశాడు అల్లు అర్జున్.
పుష్ప 1 చేసిన హంగామాకి పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి.అంతేకాదు ఈ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండాలని చూస్తున్నారు.
పుష్ప 2 సినిమా అంతకుముందు షూటింగ్ చేయగా కేవలం ఐదు రోజులు మాత్రమే షూట్ చేసినట్టు తెలుస్తుంది.ఇక లేటెస్ట్ షెడ్యూల్ లో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తారని తెలుస్తుంది.
పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ రీసెంట్ గా వైజాగ్ చేరుకున్నాడు.అయితే పుష్ప 2 ఇంకా మొదటి దశలోనే ఉందని అర్ధమవుతుంది.ఇలా చేస్తే దాదాపు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా ఆ సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ కనిపించట్లేదు.పుష్ప 2 మరీ లేట్ చేస్తే ఆడియన్స్ ఆ సినిమాపై ఉన్న ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది.
సుకుమార్ ఈ విషయంలో కాస్త స్పీడ్ గా ఉంటే బెటర్ అని అంటున్నారు.పుష్ప 1 మాదిరిగా పుష్ప 2ని కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందా.
పుష్ప 2 అంచనాలను మించి ఉంటుందా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.