నీ స్నేహం చిత్రం చాలా మంది VN ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా అని పొరపడుతూ ఉంటారు .ఎందుకంటే అంతకు ముందే అదే బ్యానర్ లో మనసంతా నువ్వే సినిమాకు అయన దర్శకుడిగా పని చేసి ఘన విజయాన్ని దక్కించుకున్నారు కాబట్టి.
ఇంచు మించు నీ స్నేహం మరియు మనసంతా నువ్వే సినిమాలు కుటుంబ నేపథ్యంలో తెరకెక్కాయి కాబట్టి ఆ పేరు బలంగా జనల మనస్సులో పడిపోయింది.వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు పేరు పరుచూరి మురళి.
![Telugu Andhrudu, Gopichand, Nee Sneham, Peda Babu, Tollywood, Uday Kiran-Latest Telugu Andhrudu, Gopichand, Nee Sneham, Peda Babu, Tollywood, Uday Kiran-Latest](https://telugustop.com/wp-content/uploads/2023/01/Manasantha-Nuvve-peda-babu-uday-kiran-Nee-Sneham-tollywood.jpg )
పరుచూరి మురళి కి కూడా ఇది తొలి సినిమానే కావడం విశేషం.మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా ఈ సినిమా చుసిన తర్వాత మురళి గురించి అనుకోకుండా ఉండరు.నీ స్నేహం మంచి విజయాన్ని సాధించి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ కి హిట్టు చిత్రాన్ని ఇవ్వడమే కాకుండా కొత్త దర్శకుల చేతిలో వరసగా సినిమాలు పెట్టడానికి ఊతం ఇచ్చింది.ఆ తర్వాత ప్రభుదేవా ను కూడా నువ్వొస్తానంటే నేనద్దంటానా సినిమాకు తెలుగు లో దర్శకుడిగా చేయించారు.
ఇక పరుచూరి మురళి విషయానికి వస్తే ఈ సినిమా తర్వాత జగపతి బాబు తో పెదబాబు సినిమా, గోపి చంద్ తో ఆంధ్రుడు, నితిన్ హీరోగా రెచ్చిపో, బాలయ్య బాబు తో అధినాయకుడు.జగపతి బాబు మరియు నారా రోహిత్ తో ఆటగాళ్లు సినిమాలు చేసారు.
![Telugu Andhrudu, Gopichand, Nee Sneham, Peda Babu, Tollywood, Uday Kiran-Latest Telugu Andhrudu, Gopichand, Nee Sneham, Peda Babu, Tollywood, Uday Kiran-Latest]( https://telugustop.com/wp-content/uploads/2023/01/Manasantha-Nuvve-Andhrudu-peda-babu.jpg)
పరుచూరి మురళి చేసింది ఆరు సినిమాలు మాత్రమే అయినా నీ స్నేహం మరియు పెదబాబు చిత్రాలు విజయం సాధించాయి. ఆంధ్రుడు మ్యూజికల్ గా పర్వాలేదు అనిపించింది.మిగతా సినిమాలు పరాజయం చవి చూశాయి.ఇక 2018 లో ఆటగాళ్లు చిత్రం తర్వాత మళ్లి ఇంకొక సినిమా మురళి చేయలేకపోయాడు.మొదటి సినిమాలు ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత చిత్రాలు పెద్దగా ఆడకపోవడం తో ఆయనకు అవకాశం ఇచ్చే నిర్మాణ సంస్థలు కరువు అయ్యాయి.అయన దోవలోనే వి ఎన్ ఆదిత్య లాంటి దర్శకులు ఆరంభ శూరత్వం లాగ మొదటి కొన్ని సినిమాలకే విజయాలను చూస్తూ ఇప్పుడు అడ్డ్రస్సు గల్లంతవుతున్నారు.
ఏది ఏమైనా మంచి కథ ఉంటె ఎప్పటికైనా ఇలాంటి దర్శకులు మళ్లి మెరవగలరు.