సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మంచుగడ్డ కట్టకుపోయి వివిధ రకాల రూపంలో పేరుకుపోతుంది.ఈ మంచు ముఖ్యంగా పర్వతాల లాగా, అలానే నదులపై ఒక రోడ్డు లాగా సెటిల్ అవుతుంది.
ఐతే తాజాగా ఓ గడ్డకట్టిన నదిలో మంచు అనేది పువ్వు ఆకారంలో ఏర్పడింది.ఈ నది నలువైపులా పలుచుగా ఏర్పడిన ఆ మంచు పొర పువ్వులా భలే అందంగా ఉంది.
ఈ పువ్వును ఎవరో తమ చేతులతో చాలా అందంగా మలిచినట్లు కనిపించింది కానీ ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన పువ్వు.అందుకే దీనిని చూసినవారు ఆశ్చర్యపోయి దాని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అవి కాస్త వైరల్ గా మారాయి.
ఇంతకీ ఈ అద్భుతమైన నేచర్ వండర్ ఎక్కడ వెలుగు చూసిందంటే.
ఈశాన్య చైనాలోని సాంగ్హువా నదిపై ఈ పువ్వు ప్రత్యక్షమైంది.నార్వే మాజీ దౌత్య ప్రతినిధి ఎరిక్ సోల్హీమ్ ఈ బ్యూటిఫుల్ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ ఫొటోలో నది నీటిపై మంచు ముక్కలు విచ్చుకున్న పూల షేప్‌లో కనిపించడం మీరు గమనించవచ్చు.సూర్యకిరణాలు ఈ మంచు ముక్కలపై పడినప్పుడు అవి బంగారు వర్ణంలో మెరుస్తూ బంతిపూవులా అద్భుతంగా కనిపించి ఆకట్టుకుంది.
ఈ అద్భుతమైన ఫొటోపై నెటిజన్లు.“ఇది సూపర్‌గా ఉంది”, ” ఇది నిజంగా అద్భుతమైన దృశ్యం” అని కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా మంచు పువ్వుల నిర్మాణం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.అవి పొదలపై ఏర్పడతాయి.మంచు పువ్వులు ఏర్పడటానికి ఉత్తమ సమయం శరదృతువు చివరిలో లేదా శీతాకాలపు ప్రారంభంలో ఉదయం అని చెబుతారు.