బాసర సరస్వతి అమ్మవారి పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం నాడు అర్చకులు బంద్ చేస్తున్నారు.అమ్మవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.
బాసర సరస్వతి అమ్మవారి పై వాక్యాలను నిరసిస్తూ బాసరలో వ్యాపారులు స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నారు.బంద్ తో పాటు బాసర రోడ్లు నిర్మానుషంగా మారిపోయాయి.
ఈ వాక్యాలు నిరసిస్తూ రాస్తారోకో కూడా చేస్తున్నారు.ఈ రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
ఈ అనుచిత వ్యాఖ్యల పై బాసర దేవాలయానికి చెందిన అర్చకులు కూడా నిరాశ తెలుపుతున్నారు.
బాసర సరస్వతి అమ్మవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ లో వికారాబాద్ జిల్లా కొండగల్ మండలం రావులపల్లి లో జరిగిన సభలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వాక్యాలపై అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరాశనకు దిగిన విషయం తెలిసిందే.
ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు.
దీని వల్ల నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నరేష్ పై పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయ్యప్ప స్వామి పై ఉద్దేశపూర్వకంగా అనే వాఖ్యలు చేసినట్లు నరేష్ ఒప్పుకున్నాడు.ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా వెల్లడించారు.
నరేష్ అయ్యప్ప స్వామి పై చేసిన వాక్యలు వైరల్ గా మారి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన పోలీసులు నరేష్ ను అరెస్టు చేశారు.