జంతువులకు సంబంధించిన అనేక ఆసక్తికర వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంటాయి.అందులో ఎన్నో వైరల్ వీడియోలు చాలా ఉత్కంఠ రేపుతాయి.
వాటిలో కొన్ని మనం అడవి జంతువులకు సంబంధించినవి చూడవచ్చు.కొన్ని వీడియోలలో కొందరు తమ ప్రాణాలకు ముప్పు కలిగించే జంతువులతో విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు.
నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు, సోషల్ మీడియాలో లైకులు సంపాదించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు.ఒక్కోసారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడమో, లేదా ఏదైనా ఇబ్బందుల్లో పడడమో జరుగుతుంది.
ఇదే కోవలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రమాదాలు చెప్పి రావు.అయితే కొన్ని సంఘటనల్లో స్వయంకృతాపరాధాల వల్లే సమస్యలు ఎదురవుతుంటాయి.ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.ఓ వ్యక్తికి మొసళ్లు అంటే చాలా ఇష్టం.ఈ క్రమంలో ఓ మొసలితో ఆడుకుంటుంటాడు.ఈ క్రమంలో మొసలిపై కూర్చుని దానితో చెలగాటమాడతాడు.
కుడి చేతిని దాని తలపై ఉంచి ఎడమ చేతినిచాలా మెల్లగా మొసలి నోట్లో పెడతాడు.అప్పటికే నోరు విశాలంగా చాపిన ఆ మొసలి అమాంతంగా అతడి చేతిని కరిచేయాలని ప్రయత్నిస్తుంది.
అయితే ఇది గమనించిన ఆ వ్యక్తి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటాడు.దీంతో త్రుటిలో ప్రమాదం తప్పుతుంది.
లేకుంటే అతడి చేతిని ఆ మొసలి కరకరా నమిలి మింగేసేది.కొంచెంలో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఈ వీడియోను animals_powers అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ప్రాణాల కోసం చెలగాటం ఆడడం సరికాదని హితవు పలుకుతున్నారు.ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి స్టంట్స్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.