డిసెంబర్ 21న ‘ఆహా’లో ప్రీమియర్ అవుతున్న ‘మసూద’

ఒక‌రిపై అంతులేని కోపంతో ఎవ‌రైనా చ‌నిపోతే వారి ఆత్మ ప‌గ తీర్చుకోవాల‌ని అనుకుంటుంది.వారి విధిలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

 Masooda Is Premiering On 'aha On December 21, Aha, Aha Ott , Tollywood, Masooda-TeluguStop.com

అలాంటి ఓ భ‌యాన్ని, ఆందోళ‌న‌, వ్యాకుల‌త వంటి హార‌ర్ అనుభ‌వాల‌ను ఆహాలో ప్రేక్ష‌కులు ‘మ‌సూద‌’ సినిమా రూపంలో చూడబోతున్నారు.మసూద చిత్రాన్ని తమ అభిమాన ప్రేక్ష‌కుల కోసం వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది.

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సంగీత‌, తిరువీర్‌, బాంధ‌వి శ్రీధ‌ర్‌, కావ్యా క‌ళ్యాణ్‌రామ్‌, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు న‌టించిన మ‌సూద చిత్రం అద్భుత‌మైన ట్విస్టులు ట‌ర్నుల‌తో క్లాసిక్ హార‌ర్ మూవీగా ఆద‌ర‌ణ పొందింది.

సాయి కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ హార‌ర్ సినిమా ఎగ్జ‌యిట్‌మెంట్‌, భ‌యాన్ని క‌లిగించే సినిమాల‌ను చూడాల‌నుకునే వారికి, హార‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది.

చీక‌టి, భ‌యాన్ని తెప్పించే హార‌ర్ స‌న్నివేశాలను చూసిన‌ప్పుడు వెన్నులో వ‌ణుకు పుడుతుంది.గోపికృష్ణ (తిరువీర్‌) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.త‌న ప‌క్క‌నున్న ఫ్యామిలీ అత‌నికి తెలియని ఇష్టం, అనుబంధం ఏర్ప‌డుతుంది.ఆ ఫ్యామిలీలో ఉండే నీల‌మ్ (సంగీత) ఓ సింగిల్ మ‌ద‌ర్‌.

ఆమె కుమార్తె న‌జియా (బాంధ‌వి శ్రీధ‌ర్ )తో క‌లిసి ఉంటుంది.ఓ రోజు ఉన్న‌ట్లుండి నీల‌మ్ గోపి ఇంటి త‌లుపు కొట్టి ఓ సాయం కావాల‌ని అడుగుతుంది.

త‌ర్వాత నీల‌మ్ త‌న కుమార్తె న‌జియా మాన‌సిక ఆరోగ్యం బాగోలేన‌ట్లు గుర్తిస్తుంది.ఇలాంటి ప‌రిస్థితుల‌కు మ‌సూద అనే సినిమా టైటిల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సంద‌ర్భంగా నీల‌మ్ పాత్ర‌లో న‌టించిన సంగీత మాట్లాడుతూ ‘‘హారర్ మిస్టరీ జోనర్ సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ ఉంటారు.అలాంటి జోన‌ర్ సినిమాను చేయ‌టం నాకు ఎంతో ఎగ్జ‌యిట్మెంట్‌ను క‌లిగిస్తుంది.ఓ త‌ల్లి త‌న కూతురుని చెడు నుంచి ర‌క్షించుకోవ‌టానికి ప‌దే ప‌దే చేసే పోరాటాన్ని ఈ సినిమాలో మనం చూడొచ్చు.

క‌చ్చితంగా ఆహా ఆడియెన్స్ సినిమా చూసేట‌ప్పుడు భ‌య‌ప‌డ‌తారు.థ్రిల్ అవుతారు.

’’హారర్ సినిమాలను అమితంగా ప్రేమించే ప్రేక్షకులకు మసూద కచ్చితంగా నచ్చుతుంది.కట్టిపడేసే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలన్నీ ఈ సినిమాలో మనం చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube