తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పందెంకోడి సినిమా తర్వాత విశాల్ నటించిన ప్రతి ఒక్క సినిమాని దర్శక నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం విశాల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం విశాల్ లాఠీ, మార్క్ ఆంథోని అనే రెండు సినిమాలు ఉన్నాయి.కాగా ఈ సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు హీరో విశాల్.
ఇది ఇలాంటి తాజాగా హీరో విశాల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే తాజాగా విశాల్ ఓ క్రేజీ ఆఫర్ రాగా అందుకు విశాల్ నో చెప్పాడట.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాను నెక్ట్స్ తీయబోయే సినిమాలో విలన్ పాత్ర కోసం విశాల్‌ని సంప్రదించాడట.కానీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నానని,ఈ సమయంలో రిస్క్ తీసుకోలేనని విశాల్ ఆ ప్రపోజల్‌ని తిరస్కరించినట్లు కోలీవుడ్‌లో సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇంతకీ లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ దళపతి విజయ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు.నిజానికి హీరో విశాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా అతనికి బాగా ప్లస్ అయ్యేది.
కానీ ఇటీవల కాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం నెగటివ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా తర్వాత అతనికి ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు.గత మూడేళ్లుగా విశాల్‌కి వరుస ప్లాప్‌లు ఎదురవుతూనే ఉన్నాయి.దాంతో విశాల్ దర్శకత్వం వైపు వెళ్తున్నట్లు కూడా ప్రచారాలు కూడా జరిగాయి.నిజానికి డైరెక్టర్‌గా కూడా ఇప్పటికే విశాల్ తనని తాను ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే విజయ్ మూవీలో విశాల్ నటించకపోవడానికి మరో కారణం కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
అతను తన నెక్ట్స్ మూవీని విజయ్‌తోనే చేయబోతున్నాడట.ఈ మేరకు ఇప్పటికే కథని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.