కృష్ణంరాజు, కృష్ణ కొన్నిరోజుల గ్యాప్ లో మరణించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.మంచి స్నేహితులు అయిన కృష్ణ, కృష్ణంరాజు పదుల సంఖ్యలో సినిమాలలో కలిసి నటించి ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.
కృష్ణ, కృష్ణంరాజు మరణం గురించి శ్యామలాదేవి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మాట్లాడుతూ కృష్ణ కృష్ణంరాజు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని అన్నారు.
వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు అని ఆమె కామెంట్ చేశారు.ఇద్దరూ ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చారని వెళ్లిపోయే సమయంలో కూడా కలిసి వెళ్లిపోదాం అని అనుకున్నారేమో అంటూ శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.
అందువల్లే మనందరికీ ఇంత బాధను మిగిల్చి ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని శ్యామలా దేవి కామెంట్లు చేశారు.
మహేష్ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడం బాధాకరం అని ఆమె చెప్పుకొచ్చారు.
![Telugu Krishna, Krishnakrishnam, Krishnam Raju, Mahesh Babu, Syamala Devi, Vijay Telugu Krishna, Krishnakrishnam, Krishnam Raju, Mahesh Babu, Syamala Devi, Vijay](https://telugustop.com/wp-content/uploads/2022/11/syamala-devi-shocking-comments-krishna-krishnamraju-goes-viral-in-social-media-detailsd.jpg )
సుల్తాన్ మూవీ సమయం నుంచి కృష్ణ గారి కుటుంబంతో మా కుటుంబానికి అనుబంధం ఏర్పడిందని శ్యామలాదేవి కామెంట్లు చేశారు.సుల్తాన్ షూటింగ్ లో భాగంగా అండమాన్ కు వెళ్లిన సమయంలో విజయనిర్మల గారు వంట చేసి పెట్టేవారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.కృష్ణ పుట్టినరోజున కృష్ణంరాజు ఫోన్ చేసి చేపల పులుసు చేసి పెడతానని చెప్పారని శ్యామలాదేవి అన్నారు.
![Telugu Krishna, Krishnakrishnam, Krishnam Raju, Mahesh Babu, Syamala Devi, Vijay Telugu Krishna, Krishnakrishnam, Krishnam Raju, Mahesh Babu, Syamala Devi, Vijay](https://telugustop.com/wp-content/uploads/2022/11/syamala-devi-shocking-comments-krishna-krishnamraju-goes-viral-in-social-media-detailss.jpg )
ఈరోజు కృష్ణ, కృష్ణంరాజు లేరనే విషయం తెలిసి తట్టుకోలేకపోతున్నామని శ్యామలాదేవి అన్నారు.శ్యామలాదేవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భూమి, ఆకాశం ఉన్నంత వరకు వాళ్లు చిరస్మరణీయులుగా మిగిలిపోతున్నారని శ్యామలాదేవి వెల్లడించారు.
కృష్ణ మరణవార్త విని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఫీలవుతున్నారు.మహేష్ ఫ్యామిలీకి వరుసగా కష్టాలు ఎదురవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.