మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు అల్లు అరవింద్. ఈయన మీడియం బడ్జెట్ సినిమాల నుండి పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.
అలాగే డబ్బింగ్ సినిమాలను కూడా తన బ్యానర్ పై రిలీజ్ చేస్తూ లాభాలు గడిస్తున్నాడు.ఇక అల్లు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒక టీవీ షోలో పాల్గొన్న అల్లు అరవింద్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలిపాడు.గత కొన్నేళ్ల నుండి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నానని తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ ఇంకా రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఈయన కల అట.చరణ్- అర్జున్ పేరుతో టైటిల్ కూడా గత కొన్నేళ్ల క్రితమే రిజిస్టర్ కూడా చేయించాను అని తెలిపాడు.
ఇక అప్పటి నుండి అల్లు అరవింద్ ఈ టైటిల్ కోసం ప్రతీ ఏడాది రెన్యూవల్ చూపిస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడట.మరి ఇద్దరు మెగా హీరోలతో చేసే ఈ సినిమా ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఈ సినిమా కోసం ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.
అల్లు అర్జున్, చరణ్ కలిసి నటించడం సాధ్యమేనా అనే అనుమానం కూడా వస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు దర్శకత్వం వహించే డైరెక్టర్ గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించ నున్నాడు అని టాక్ వస్తుంది.అల్లు అరవింద్ ఈ సినిమాకు త్రివిక్రమ్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నాడట.
ఈ ప్రాజెక్ట్ కోసం ఈయనను రమ్మని అల్లు అరవింద్ కోరారట.మరి ప్రెజెంట్ మహేష్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.