టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు హైదరాబాద్ లో సొంతిళ్లు కలిగి ఉన్నారు.సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల కాగా కొంతమంది సెలబ్రిటీలు సొంతిల్లు ఉన్నా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు.
ఇంద్రభవనాల లాంటి ఇళ్లు ఉన్నా సెలబ్రిటీలు వేర్వేరు కారణాల వల్ల అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
మహేష్ డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.జూబ్లీహిల్స్ లో మహేష్ బాబు కు సొంతంగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ మహేష్ బాబు మాత్రం హైదరాబాద్ లోని వేరే ప్రాంతంలో ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ లో ఉన్నారు.
మరో స్టార్ హీరో నాగచైతన్య కూడా ఇదే విధంగా చేస్తున్నారు.సాధారణ ఫ్లాట్ లో చైతన్య నివాసం ఉంటున్నారు.
అబిడ్స్ దగ్గర ఉండే ఫ్లాట్ లో చైతన్య నివాసం ఉంటున్నారు.
నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరించారని సమాచారం అందుతోంది.ఆ సెంటిమెంట్ వల్ల చైతన్య ఈ ఇంటిలో నివశించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని బోగట్టా.రాజమౌళి ప్రస్తుతం మణికొండలోని ట్రిపుల్ బెడ్ రూమ్ హౌస్ లో నివాసం ఉంటున్నారు.
ఇది అద్దె ఇల్లు కావడం గమనార్హం.
మరో ప్రముఖ హీరో జగపతిబాబు సైతం ప్రస్తుతం కూకట్ పల్లిలోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు.అపోలో ఆస్పత్రికి దగ్గర్లో సొంతంగా భవనం ఉన్నా ఈ హీరో మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్నారు.వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ఈ విధంగా అద్దె ఇళ్లలో జీవనం సాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.