కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఏఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలో తాను నిర్ణయించను అని రాహుల్ గాంధీ ఎంతో వినమ్రతతో చెప్పడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వినమ్రత ఎంతో గొప్పదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ లో ఎట్టకేలకు ప్రజాస్వామీకరణకు రాహుల్ అవకాశం ఇస్తున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.