బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.రాష్ట్రంలో ఉన్న రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.
ఒకవైపు నకిలీ విత్తనాలు మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతులు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు.అంతేకాకుండా సర్టిఫైడ్ విత్తనాలని కొన్ని షాపులు యజమానులు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఆ నకిలీ విత్తనాలు వేసి చేను బాగా పచ్చగా పండుతున్నాగాని సరైన పంట పూత రాకపోవడంతో ఏమి చేయలేక చేనును పీకేస్తున్నారు.
మరోపక్క వర్షాలు కురుస్తూ ఉండటంతో పెట్టిన పెట్టుబడికి లాభం రాక అప్పుల పాలవుతున్నారు.
ఈ విధంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ… రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు.
ఈ విధంగా నష్టాలు పాలవుతున్న అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.రైతులను కన్నీరు పెట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంకి తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెబుతుందని విజయశాంతి హెచ్చరించారు.