కాంతారా గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నారు.అదొక మూఢ నమ్మకాన్ని బలంగా రుద్దే సినిమా అంటూ కొట్టి పారేసే వాళ్ళు ఉన్నా కూడా అవి కేవలం సంకుచిత ప్రశ్నలు మాత్రమే.
ఇక్కడ నమ్మకాలు, సామర్థ్యం వంటి అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది.సినిమా గురించి, దాని లోతు గురించి కాసేపు విశ్లేషణ పక్కన పెడితే ప్రేక్షకుడికి ఏం కావాలి మేకర్స్ కి నిజంగా తెలియదు.
హిందీ వాళ్ళు ఏం చేసిన అక్కడ జనాలు తిప్పి కొడుతున్నారు.సగటు ప్రేక్షకుడికి కొత్తదనం కావాలి అని కోరుకుంటున్నాడు.
సౌత్ ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండ ఉంటుంది.
ఉదాహరణకు పొన్నియన్ సెల్వన్ సినిమా సంగతి చూద్దాం.
ఈ సినిమా కి దేశం మెచ్చిన దర్శకుడు మణిరత్నం పని చేసిన ఒక్క తమిళీలు మిహహ ఈ భాషలో హిట్ అవ్వలేదు.ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన తెలుగు లో అయితే పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.
కానీ తమిళ్ లో మాత్రం మూడు వందల కోట్లు వసూళ్లు సాధించింది.ఇదే బలం అన్ని చోట్ల పని చేయలేదు.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఇది అన్ని భాషల్లో హిట్ అయ్యింది.
కానీ మన అల్లూరి, కొమరం భీం లాంటి ఆది వాసిలు చరిత్రలో నిలిచిపోయే యోధులు.కానీ తనదైన సొంత టెస్ట్ తో అల్లూరి సీత రామ్ పాత్రను మిలిటరీ ఆర్మీ లో చూపించి కమర్షియల్ సినిమాగా మార్చేసి, ఈ సినిమాకు కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ కి ఏకంగా బీజేపీ ప్రభుత్వం రాజ్య సభ సీట్ కూడా ఇచ్చి చరిత్రకు మకిలి పట్టించారు.ఇక దీని కోసం వందల కోట్ల ఖర్చు, మరియు గ్రాఫిక్స్.
ఇక మలయాళం విషయానికి వస్తే మోహన్ లాల్ సైతం ఒక ప్రయోగాత్మక సినిమా మరక్కల్ సినిమా తీసాడు.ఇతడొక సముద్ర విజేతగా బాగా పాపులర్.ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా తీసిన ఇది వారి సొంత భాషలో కూడా ఫ్లాప్ అయ్యింది.సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం మంచి కథ లేకపోవడం కాదు.
ఉన్న కథను సరిగ్గా తీయలేకపోవడం.దాదాపు ఈ సినిమా బడ్జెట్ వదల కోట్లు.
అయినా సాధించింది శూన్యం.విపరీతమైన గ్రాఫిక్స్ వాడిన ప్రేక్షకుడికి నచ్చలేదు.మరి ఈ మూడు సినిమాలకు పెట్టిన క్యారవాన్ల ఖర్చు కూడా కాదు కాంతారా బడ్జెట్. కేవలం 15 కోట్లు ఖర్చు చేసి ఎలాంటి అట్టహాసానికి పోకుండా, ఆడంబరాలు లేకుండా వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొడుతుంది.
ఇది సౌత్ లోని ప్రాంతీయ సినిమాలకు ఉన్న పోలిక.