ఈ మధ్యకాలంలో దొంగలు విచిత్రంగా బ్యాంకు దొంగతనాలను చేస్తున్నారు.దొంగతనాలకు వచ్చి తుపాకులతో బెదిరించి, కత్తులు చూపించి బ్యాంకులలో దొంగతనాలు చేస్తున్నారు.
అలాంటప్పుడు కొన్ని బ్యాంకుల సిబ్బంది దొంగలపై ఏమాత్రం దాడి చేయకుండా వారు ఎంత అడుగుతే అంత ఇచ్చేస్తారు.కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న బ్యాంకు సిబ్బంది మాత్రం దొంగ పై ఎదురుదాడికి దిగి దొంగ పరిగెత్తే వరకు వరకు వదలలేదు.
జైపూర్ లో ఒక బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించింది.ఆ దొంగకు భయపడకుండా ఎదిరించి పారిపోయేలా చేసింది.
ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం జరిగింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖం కనబడకుండా ఒక గుడ్డను చుట్టుకుని వచ్చిన ఒక దొంగ పదునైన కత్తితో బ్యాంకులోకి వచ్చాడు.బ్యాంకు లోకి వచ్చిన దొంగ తన చేతిలో ఉన్న కత్తితో బ్యాంకు సిబ్బందిని బెదిరించాడు.
తన దగ్గర ఉన్న బ్యాగులో డబ్బులు నింపాలని ఆ బ్యాంకు సిబ్బందికి దొంగ బెదిరించాడు.కానీ అక్కడ ఉన్న ఒక ఉద్యోగి ఆ దొంగకు భయపడకుండా దొంగ దొంగ అని అరిచాడు.
అరుపులు విని బ్యాంకు మేనేజర్ పూనం గుప్తా బయటకు వచ్చినప్పుడు ఆమెను కూడా ఆ దొంగ కత్తితో బెదిరించసాగాడు.కానీ బ్యాంకు మేనేజర్ ఆ దొంగ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా అతన్నే బెదిరించింది.ఇక మరో ఉద్యోగి దొంగ లోపల ఉన్నప్పుడు బయటకు పరుగు తీసి ఆ బ్యాంకు డోర్ మూసేశాడు.దీంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు.దొంగను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన లావీష్ ఆరోరాగా పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజెన్లు బ్యాంకు మేనేజర్ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.