కలిసిరాని నేతలతో కాంగ్రెస్ అభ్యర్ధి కష్టాలు ! 

ఎవరు ఊహించని విధంగా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చాయి.కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం,  అది ఆమోదం పొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

 Munugode Congress Candidate Palvai Sravanthi Not Getting Support From Party Lead-TeluguStop.com

అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణారావు అనే వ్యక్తిని పోటీకి దించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నించినా,  చివరకు పాల్వాయి స్రవంతికి అధిష్టానం టికెట్ ఇవ్వడం,  ఆమె నామినేషన్ వేయడం వంటివి జరిగిపోయాయి.ఇక ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ టిఆర్ఎస్ బీజేపీలకు ముచ్చెమటలు పట్టించాలని, కాంగ్రెస్ సెట్టింగ్ స్థానాన్ని మళ్లీ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నా.

మిగిలిన నాయకుల సహకారం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఆందోళన కలిగిస్తుంది.
  పేరుకు స్టార్ క్యాంపైనర్లుగా దాదాపు 38 మంది నాయకులు ఉన్నా… ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ , బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ బాగా వెనకబడినట్టుగానే కనిపిస్తుంది.

ఎన్నికల ప్రచారమూ అంతంత మాత్రమే అన్నట్టుగా జరుగుతోంది.దీంతో పాల్వాయి స్రవంతి తీవ్ర టెన్షన్ కు గురవుతున్నారు.ఇటీవల జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు.ఈ ఉప ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ దక్కించుకుని రాబోయే ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తున్నా.

పార్టీ సీనియర్ నాయకుల సహకారం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ముఖ్యంగా పాల్వాయి స్రవంతికి ఈ టిక్కెట్ దక్కడానికి కారణమైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

మిగిలిన నాయకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

Telugu Congress, Munugodu, Revanth Reddy-Political

పాల్వాయి స్రవంతి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి వారు తప్ప , మిగిలిన వారు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.మునుగోడు నియోజకవర్గం లో మండలానికో సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించినప్పటికీ,  ప్రచారంలో వారి ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటోంది.దీనికి తోడు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జాడో యాత్ర ఈనెల 23వ తేదీ నుంచి తెలంగాణలో జరగబోతుండడంతో,  పార్టీ సీనియర్ నాయకులంతా ఆ యాత్ర ఏర్పాటు పనులో బిజీగా ఉంటుండడంతో , మునుగోడులో పూర్తిస్థాయిలో వారు సమయాన్ని కేటాయించలేకపోవడం , ఎన్నికల ప్రచారంలో వెనకబడుతుండడం వంటివి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఆందోళన కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube