ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపితమైంది.అలాగే వయసు ప్రేమకు అడ్డంకే కాదని ఓ 18 ఏళ్ల పాప బల్లగుద్ది మరీ చెబుతోంది.అవును, ఓ 18 ఏళ్ల యువతి.62 ఏళ్ల ముసలాడితో ప్రేమలో పడింది.అంతటితో ఆగలేదు సుమా… వివాహం కూడా చేసేసుకుంది.దీంతో ఈ విషయం.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ యువతి తన ప్రేమకు గల కారణం చెప్పి అందరిని షాక్‌కు గురిచేసింది.ఇంతకీ ఆ ప్రేమ వెనుక ఉన్న కారణాలు మీకు తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే.
పాకిస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల ఆసియా రావల్పిండి అనే ప్రాంతంలో నివాసం ఉంటుంది.అదే ప్రాంతంలో 62 ఏళ్ల ముసలాడు రాణా శంషాద్ కూడా నివాసం ఉంటున్నాడు.
అతడు వృత్తి రిత్యా దుప్పట్లు అమ్ముతూ ఉంటాడు.అలాగే వాటికి రంగులు కూడా వేస్తాడు.
ఆసియాకు దుప్పట్లు అంటే చాలా ఇష్టం అట.ఈ క్రమంలోనే దుప్పట్లకు రంగులు వేయించడానికి అతడి దగ్గరకు తీసుకెళ్లింది.ఈ క్రమంలో ఆ వృద్దుడు ఆసియాకు ఓ అందమైన దుప్పటిని బహుమతిగా ఇచ్చాడు.దాంతో అతడితో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ.ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడటంతో వారు పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇకపోతే వివాహానికి ముందే రాణా శంషాద్ తన వయసు 62 ఏళ్లు అని ఆసియాతో చెప్పకనే చెప్పాడట.అయినా ఆమె తనని ప్రేమించడం మానలేదట.ఆసియాను పెళ్లి చేసుకున్నాక రాణా శంషాద్ జీవితం ఆనంద మయంగా మారిందని చెప్పాడు.
కాగా ఈ విషయం ఆనోట ఈ నోట పడి వైరల్ కావడంతో ప్రముఖ ఛానల్ ఆసియాను, రాణాను ఇంటర్వ్యూ చేసింది.ఇందులో ఆసియా మాట్లాడుతూ.రాణా చాలా మంచివాడని.అతడి మంచితనం చూసే తనని ప్రేమించానని చెప్పుకొచ్చింది.