ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు వారి దేశాలలో పనులు లేక, ఉద్యోగాలు లేక ఏదో ఒక దేశానికి వలస వెళుతూ ఉంటారు.మన భారతదేశం వారు కూడా చాలా దేశాలలో వలస వెళ్లి జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
అలా వలస వెళ్లడం అంటే మామూలు విషయం మాత్రం కాదు.మన తల్లిదండ్రులకు, కుటుంబాలకు దూరంగా వలస వెళ్లి అక్కడ పనులు చేసి జీవించడం అంటే అలా వెళ్ళిన వారి బాధ వర్ణించలేనిది.
అలా వలస వెళ్లే ప్రయాణంలో చాలా ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి.ఆహారం దొరకక చాలా బాధలు పడే వారు కూడా ఉన్నారు.చిన్న వయసుగల వారు అయితే మరీ ఎక్కువ బాధను అనుభవించవలసి వస్తుంది.తాజాగా సిరియా దేశానికి చెందిన కొందరు ప్రజలు ఒక చిన్న పడవపై యూరప్ కు అక్రమంగా వలస వెళుతున్నారు.
మార్గం మధ్యలో ఆ పడవలో ఉన్న ఒక చిన్నారికి దాహం వేసి నీరు కావాలని అడిగాడు.పడవలో త్రాగడానికి మంచినీరు లేకపోవడంతో ఆ చిన్నారి దాహంతో ఎక్కి ఎక్కి ఏడుస్తూ చివరికి చనిపోయాడు.

కుమారుడు దాహం వేసి మరణించడం కళ్ళముందే చూసిన తండ్రి గుండె ఆగినంత పని అయింది.చివరకు పట్టలేని దుఃఖంతో ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని సముద్రం మధ్యలో వేశాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.అయితే ఇలా వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి.మరి కొంతమంది అల్లాహు అక్బర్ అని అంటుంటే ఆ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని సముద్రంలో పడవేశాడు.అందుకే పెద్దలంటారు దేవుడు ప్రపంచంలో ఉన్న ఒక్కొక్కరి చావును ఒక్కొక్క విధంగా రాసిపెట్టి ఉంటాడు.
చావు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ కూడా తెలియదు.







