అయ్యో పాపం... శర్వానంద్‌ మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు

యంగ్ హీరో శర్వానంద్ సుదీర్ఘ కాలం తర్వాత ఒక డీసెంట్ సక్సెస్ సినిమా తో కెరియర్ లో మళ్ళీ నిలదొక్కుకున్నాడు.అదే ఒకే ఒక్క జీవితం.

 Sharvanand Oke Ok Jeevitham Movie Collections Details, Sharwanand, Oke Oka Jeevi-TeluguStop.com

రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఒక టైం ట్రావెల్ నేపథ్యం స్టోరీ.

విభిన్నమైన పాత్రలతో దర్శకుడు చేసిన ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కింది కానీ వసూళ్ల విషయంలో నిరాశ తప్పదేమో అనిపిస్తుంది.ఎందుకంటే శర్వానంద్ గత చిత్రాల ఫలితం కారణంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో గ్రాండ్ రిలీజ్ దక్కలేదు.

అలాగే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అగ్రేసివ్‌ గా నిర్వహించ లేదు.అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమా కు పెద్దగా హైప్‌ క్రియేట్ కాలేదు.

సినిమా విడుదల తర్వాత ఎలాగూ మౌత్ టాక్ తో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ప్రేక్షకులలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది.కానీ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది.

ఒకవైపు బ్రహ్మాస్త్ర సినిమా ఉండడం వల్ల ఈ సినిమా కు ఎక్కువ స్థాయిలో థియేటర్లు కేటాయించలేక పోతున్నాం అంటూ బయ్యర్లు చేతులు ఎత్తేశారు.తీరా చూస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది.

Telugu Akkineni Amala, Ritu Varma, Okeoka, Sharvanand, Telugu-Movie

ఇప్పుడు ఆ సినిమా వేసిన థియేటర్లలో కొన్నింటిని తీసి వేసి ఒకే ఒక జీవితం సినిమాను వేస్తే బాగుంటుంది అంటూ ఇప్పుడు కొందరు భావిస్తున్నారు.కానీ ఇప్పటికే ఆలస్యమైంది.సినిమా ప్రమోషన్ భారీగా చేసి మంచి బయ్యర్లకు సినిమా ను అప్పగించి ఉంటే భారీ ఎత్తున విడుదల అయ్యేది, తద్వారా మంచి వసూలు నమోదు అయ్యేది అంటూ టాక్‌ వినిపిస్తుంది.ఒక మంచి అవకాశాన్ని శర్వానంద్ మిస్ చేసుకున్నాడని ఇలాంటి అవకాశం మళ్ళీ శర్వానంద్ కి ఎప్పుడు వస్తుందో అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube