సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.చిన్నపిల్లల క్యూట్ , డ్యాన్స్ వీడియోలు మరింత ట్రెండింగ్ గా మారుతూ ఉంటాయి.
చిన్నపిల్లలు చేసే చిలిపి చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి.ఈ వీడియోలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది.
ఇక పెద్దలు చేసే వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
ఓ వ్యక్తి వినూత్నంగా డ్యాన్స్ వేయడానికి ప్రయత్నించిన వీడియో నవ్వులు పూయిస్తుంది.స్టాండ్ కు మొబైల్ అమర్చి గొడపైన పెట్టి వీడియో ఆన్ చేసి వేగంగా వెళ్లి వెనక్కి తిరిగి డ్యాన్స్ వేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.
అయితే స్టాండ్ తో సహా మొబైల్ నీళ్లో పడిపోతుంది.ఇది పట్టించుకోని అతడు వెనక్కు తిరిగి మెలికలు తిరుగుతూ డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు.
అయితే కాసేపు తర్వాత అతడు గమనిస్తే ఫోన్ కనిపించదు.దీంతో పరుగులు తీసుకుంటూ వచ్చి మొబైల్ కోసం వెతుకుతాడు.
నీళ్లల్లో చేయి పెట్టి మొబైల్ కోసం వెతుకుతాడు.ఫోన్ నీళ్లల్లో పడినా గమనించకుండా వింతగా డ్యాన్స్ వేస్తున్న అతడి వీడియో నవ్వులు పంచుతుంది.
చాలా ఫన్నీగా, కామెడీగా ఉంి.
ఈ వీడియోను కొంతమంది సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీంతో ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దీనిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.చాలా ఫన్నీగా ఉందని, నవ్వు ఆపుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ యువకుడి తెలివికి హ్యాట్పఫ్ అని అంటున్నారు.
మొబైల్ ను కూడా చూసుకుకోకుండా డ్యాన్స్ వేస్తూ పనిలో నిమగ్నమయ్యాడని మరికొంతమంది అంటున్నారు.