అనుపమ పరమేశ్వరన్ హీరో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో రన్ అవుతుంది.
ఇలా ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ మరొక క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజె టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శర్మను కాకుండా మరొక హీరోయిన్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే అవకాశాన్ని అనుపమ పరమేశ్వరన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఒప్పంద పత్రంపై అనుపమ సంతకం కూడా చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి సిద్దు స్క్రిప్ రైటర్ గా డైలాగ్ రాశారని తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ మరొక క్రేజీ ఛాన్స్ దక్కించుకోవడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డిజె టిల్లు సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి