వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అనంతబాబు రిమాండ్ ఇప్పటికే ముగిసింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణను మేజిస్ట్రేట్ నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.