శుక్రవారం వచ్చింది అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.అయితే మన సౌత్ లో ఇప్పుడు కనిపిస్తున్న సినిమా సందడి నార్త్ లో కనిపించడం లేదు.
ఇది వరకు లాగా అక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం లేదు.థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం లేదు.
అసలు బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.అందుకే మన సౌత్ ఇండియా కంటే బాలీవుడ్ ఈ మధ్యన వెనుకబడి పోయింది.
కరోనా తర్వాత బాలీవుడ్ ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు, దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.
అలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే ఒకే ఒక్క హిట్ సినిమా పడాలి.కానీ ఇప్పట్లో బాలీవుడ్ కు అలాంటి హిట్ పడేలా లేదు.
నిన్న రిలీజ్ అయినా రెండు సినిమాలను కూడా చెత్త సినిమాలు అంటూ తేల్చేసారు అక్కడి ప్రేక్షకులు.ఈ మధ్య కాలంలో అక్కడ రెండెంకెల ఓపెనింగ్స్ తేవడమే గగనం అయిపోయింది.20 కోట్ల ఓపెనింగ్స్ కూడా తేలేక చేతులెత్తేస్తున్నాయి.ఆగష్టు 11న రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాయి.
రెండు కూడా భారీ ఓపెనింగ్స్ కూడా తేలేక పోయాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ అయ్యి నిరాశ పరిచింది.పాజిటివ్ రాకపోవడం ఈ సినిమా వసూళ్లపై భారీ ప్రభావం చూపించింది.
ఈ సినిమా ఇండియా మొత్తం కలిపి కూడా 11 నుండి 12 కోట్ల లోపు మాత్రమే వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇది అమీర్ ఖాన్ వంటి భారీ స్టార్ కు అతి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
గత దశాబ్దంలోనే అమీర్ కు ఇవి అతి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
ముందు నుండే ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
అలాగే బాయ్ కాట్ అంటూ హాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేయడం ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపాయి.ఇక ఫస్ట్ షో తోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత కూడా అంచనాలు లేకుండానే కొనసాగింది.

అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ కూడా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అయితే 9 కోట్లు కూడా రాబట్టలేక పోయింది అని లెక్కలు వస్తున్నాయి.బాలీవుడ్ లోనే బిగ్ స్టార్స్ అయినా అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలకు కూడా ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంతో చెత్త ఓపెనింగ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు.మిడ్ రేంజ్ హీరోలు కూడా ఇంత ఓపెనింగ్స్ రాబడుతారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ఇద్దరు స్టార్ హీరోల ఓపెనింగ్స్ చూసి హిందీ పరిశ్రమ షాక్ అవుతుంది.గతంలో అమీర్ ఖాన్ ఇంతకంటే కష్టతరమైన పరిస్థితుల్లో కూడా 15 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాడు.
కానీ ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ చూసి అందరు పునరాలోచన అవసరం అని అంటున్నారు.అమీర్ కంటే అక్షయ్ సినిమా మరింత ఘోరంగా ఉంది.చిన్న సినిమాలు కూడా 8 కోట్లు ఓపెనింగ్స్ తెస్తున్నాయని కానీ స్టార్ హీరో సినిమాకు ఇంతటి ఓపెనింగ్స్ రావడం ఆలోచించాల్సిన విషయమే.చూడాలి బాలీవుడ్ ఈ పరిస్థితుల నుండి ఎలా బయట పడుతుందో.