మెగాస్టార్ చిరంజీవి హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది.ఆటో జానీ అంటూ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టుకున్న పూరీ సినిమా కథని చిరుకి వినిపించగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా మార్చాలని సూచించారట.
అయితే తను రాసుకున్న కథని తనలానే తీయాలని చూసే పూరీ మెగాస్టార్ సజెషన్స్ లైట్ తీసుకున్నారట.అందుకే ఆటో జానీ కథ అర్ధాంతరంగా ముగిసింది.
ఆ టైం లో పూరీ తనకి డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరి దగ్గరో డిస్కస్ చేసినందుకు మెగాస్టార్ మీద నొచ్చుకున్నాడు.
అదంతా జరిగిన కథ.ఈమధ్య పూరీ మెగాస్టార్ చిరంజీవి తరచు కలుస్తున్నారు.చిరు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా పూరీ జగన్నాథ్ చిన్న పాత్రలో కనిపించారట.
ఇక ఇప్పుడు పూరీ డైరక్షన్ లో వస్తున్న లైగర్ సినిమా ప్రమోషన్స్ కి చిరుని వాడేస్తున్నారు పూరీ.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సెట్ లో లైగర్ టీం ప్రత్యక్షమైంది.
విజయ్, పూరీ, ఛార్మీతో కలిసి చిరు, సల్మాన్ ఖాన్ ఉన్నారు.అయితే పూరీతో చిరు క్లోజ్ గా ఉన్న ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆశలు చిగురించాయి.
మా మెగాస్టార్ తో ఆటో జానీ ఎప్పుడు తీస్తావ్ అన్నా.ఆ సెకండ్ హాఫ్ ఏదో మార్చి బాస్ తో సినిమా ఓకే చేయించుకో అన్న.
మీ కాంబినేషన్ లో సినిమా కోసం వెయిటింగ్ అన్నా.మెగా మాస్ మూవీ మాకు కావాలన్నా అంటూ పూరీకి ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
చిరు ఓకే చెప్పాలే కానీ పూరీ అదిరిపోయే కథ రెడీ చేయడా చెప్పండి.మెగాస్టార్ మెప్పు కోసమే పూరీ వెయిటింగ్ లో ఉన్నాడు.