ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా పుష్ప ది రైజ్.పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
పుష్ప మీద బాలీవుడ్ ఆడియెన్స్ అంచనాలు లేకపోయినా సినిమాలో బన్నీ ఊర మాసిజం చూసి ఫిదా అయ్యారు.దెబ్బకి అక్కడ 100 కోట్ల కలక్షన్స్ వచ్చాయి.
పుష్ప పార్ట్ 1 ఈ రేంజ్ హిట్ అవగా దీనికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప పార్ట్ 2 మీద మరింత కసరత్తులు చేస్తున్నాడు సుకుమార్.పుష్ప 2 ఖచ్చితంగా అంచనాలకు మించి ఉండాలి.
పుష్ప పార్ట్ 2 సినిమాపై అంచనాలు పెంచేలా సినిమాలో స్టార్ట్ కాస్ట్ ఉంది.ఇప్పటికే పుష్ప వర్సెస్ షెఖావత్ అదే మన ఫాహద్ ఫాజిల్ ఫైట్ సెకండ్ హాఫ్ హంగామా ఉండబోతుందని అంటుండగా ఇప్పుడు సినిమాలో కోలీవుడ్ స్టార్ విలన్ విజయ్ సేతుపతి కూడా సినిమాలో భాగం అవుతున్నాడని టాక్.
ఇక ఈ సినిమాలో వీరితో పాటుగా అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి కూడా పుష్ప 2లో నటిస్తుందని తెలుస్తుంది.సినిమాలో ఆమె విజయ్ సేతుపతి భార్య పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.
తనకు ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే ప్రియమణి రీసెంట్ గా విరాటపర్వం సినిమాలో కూడా నటించి మెప్పించింది.పుష్ప 2 లో ఆమె పాత్ర కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
ఆల్రెడీ హీరోయిన్ రష్మిక కూడా సెకండ్ హాఫ్ లో స్కోప్ ఉన్న పాత్రే చేస్తుందని అంటున్నారు.వీరితో పాటుగా స్పెషల్ సాంగ్ కోసం మరో హాట్ బ్యూటీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఇన్ని హంగులతో పుష్ప పార్ట్ 2 కూడా ఆడియెన్స్ ని కేక పెట్టించేలా చేస్తుందని చెప్పొచ్చు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న పుష్ప 2 సినిమాని 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.