కష్టాల్లో బాలీవుడ్.. కానీ కియారా మాత్రం కోట్లలో ఉంది!

కియారా అద్వానీ. ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.

 Kiara Advani Has Become A Lucky Charm In Bollywood Details, Kiara Advani, Rc15 ,-TeluguStop.com

ఈమె తెలుగులోకి కూడా అడుగు పెట్టి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా కియారా అద్వానీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.ఈ సినిమా తర్వాత ఈమె అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

ఇదిలా ఉండగా కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు, దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.

అయితే బాలీవుడ్ ఇంత కష్టంలో ఉంటే.కియారా అద్వానీ నటించిన సినిమాలు మాత్రం వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి.అందుకే ఈమె లక్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.భూల్ భూలయ్య 2 రెండు వందల కోట్ల వరకు వసూళ్లు చేయగా.

జుగ్ జుగ్ జియో సినిమా కూడా వంద కోట్లకు పైగానే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Bhool Bhulaiya, Bollywood, Jug Jug Jio, Kiara Advani, Kiaraadvani, Lucky

ఇలా ఈ బ్యూటీ నటించే సినిమాలు మాత్రం వందల కోట్లు రాబట్టడంలో ఈమెను లక్కీ హీరోయిన్ గా చూస్తున్నారు.ఇక ప్రెజెంట్ కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ 15 సినిమాలో నటిస్తుంది.శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అంతే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోవడంతో ఈమె పేరు మారుమోగి పోయింది.శంకర్ సినిమాలో హీరోయిన్ లకు కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది.

ఈ సినిమాలో కూడా కియారకు రొమాంటిక్ టింజ్ తో పాటు కథలో కీలక పాత్ర ఉంటుందట.అందుకే కియారాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని టీమ్ చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube