కరోనా కష్టకాలం తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి అనుకుంటే, పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యుడిని వేధిస్తున్నాయి.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా పెట్రోల్ ధర రూ.100 పైనే ఉండటం బాధాకరం.అందుకే వాహనదారులు దూరప్రయాణాలు చేయాలంటే బండి తీయడానికి భయపడుతున్నారు.
గతంతో పోల్చి చూస్తే ఇపుడు పెట్రోల్‌కు కాస్త ఎక్కువ బడ్జెట్ పక్కన పెట్టాల్సి వస్తుంది.ఇక అంతంత మాత్రమే ఆదాయం వున్నవారు పూర్తిగా తమ వాహనాలను తీయలేని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి తరుణంలో పెట్రోల్ ఉచితంగా వస్తుందంటే మీరు నమ్ముతారా?
అవును.ఒక్కరోజే కాదు.ఏడాది మొత్తంలో 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి సుమా.సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ ఒకటి రూపొందించింది.ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది.
ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారు ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్ని లావాదేవీలు జరపాలి.
లావాదేవీలపై పొదుపు చేసే మొత్తం 68 లీటర్ల పెట్రోల్‌తో సమానం అని సిటీ బ్యాంక్ చెబుతోంది.ఇపుడు 68 లీటర్ల పెట్రోల్‌కు సమానం అయిన మొత్తాన్ని ఎలా పొదుపు చేయొచ్చో చూద్దాం.

ఈ కార్డుతో లావాదేవీలు జరిపితే రివార్డ్స్ లభిస్తాయి.వీటిని టర్బో పాయింట్స్ అంటారు.ప్రతీ రూ.150 లావాదేవీపై 4 టర్బో పాయింట్స్ లభిస్తాయి.అలా సంవత్సరంలో రూ.30,000 లేదా అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే యాన్యువల్ ఫీజు అనేది సున్నా.సూపర్ మార్కెట్లో, గ్రాసరీ స్టోర్స్‌లో ప్రతీ రూ.150 లావాదేవీపై 2 టర్బో పాయింట్స్, ఇతర ట్రాన్సాక్షన్స్‌పై ప్రతీ రూ.150కి ఒక టర్బో పాయింట్ చొప్పున వస్తాయి.ఒక టర్బో పాయింట్‌తో ఒక రూపాయి విలువైన ఫ్యూయెల్ కొనొచ్చని అర్ధం చేసుకోవాలి.
ఇంకా అదనపు సమాచారం కొరకు సిటీ బ్యాంక్ అఫీషియల్ సైట్ చూడగలరు.