విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కీలక నేత అని తెలిసిన విషయమే.ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.
ఈనాడు వైసీపీలో ఉన్నా ఆయన ఫాలోయింగ్ తగ్గలేదు.కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు వైసీపీ హయాంలోనూ మంత్రి పదవి దక్కించుకున్నారు.
అయితే రాజకీయాల్లో ఎన్ని స్టెప్పులు వేసినా రాంగ్ స్టెప్ వేయకూడదనే నానుడి ఉంది.ఒక్క తప్పు చాలు రాజకీయంగా పతనం కావడానికి.
అందుకే రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
తాజాగా విజయనగరం జిల్లా టీడీపీ పగ్గాలను మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జునకు టీడీపీ నేత చంద్రబాబు అందించారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కిమిడి నాగార్జునను హైలెట్ చేస్తూ ప్రసంగించారు.అంతేకాకుండా చీపురుపల్లి టికెట్ కూడా ఆయనకే ఇస్తున్నట్టు ఖరారు చేశారు.వాస్తవానికి కిమిడి నాగార్జున సరిగ్గా పనిచేయరంటూ ఆరోపణలు ఉన్నాయి.ఆయన ఎవరితోనూ కలుపుగోలుగా ఉండరని.
బెదిరింపు రాజకీయాలు చేస్తుంటారని గతంలో విమర్శలు వచ్చాయి.
గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు కిమిడి నాగార్జునకు చీపురుపల్లి టికెట్ ఇచ్చారు.
అయితే బొత్స సత్యనారాయణ లాంటి అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడిని ఎదుర్కోలేక కిమిడి నాగార్జున చతికిలపడిపోయారు.
అయినా వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు అతి నమ్మకంతో కిమిడి నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడంపై టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.బొత్స గెలుపును చంద్రబాబే ఖాయం చేశారని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.
కిమిడి నాగార్జున యువ నాయకుడు అని.ఆయనకు వ్యూహాలు రచించడం తెలియదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలపైనా కిమిడి నాగార్జునకు పట్టులేదని.
అలాంటి నేతకు టిక్కెట్ ఎలా ఖరారు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వైసీపీకి, బొత్సకు భారీ మేలు చేయడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.