గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.ఏరియల్‌ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం సమీక్ష.

 Ap Cm Jagan Mohan Reddy Review Meeting On Godavari Floods Details, Ap Cm Jagan M-TeluguStop.com

వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియామకం.వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలి.

అధికారులకు సీఎం ఆదేశం.గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయస్‌.

జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష.అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.

ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న సహాయ చర్యలపై సీఎం సమగ్ర సమీక్ష.ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం సహా అత్యవసర సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం.

ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులతోనూ సమావేశమైన సీఎం.సీఎం జగన్ కామెంట్స్.వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాలని సీఎం ఆదేశం.వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని సీఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం ఆదేశం.

సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారన్న సీఎం.

అప్రమత్తంగా గోదావరి ప్రభావిత ప్రాంతాల అధికారులు.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.రేపుకూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది.

లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టండి.వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీచేయాలి.

గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సమాగ్రిని సిద్ధంచేయండి.వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట పెట్టాలి.

ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.అందుబాటులో నిత్యావసరాలు.

వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి.బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోండి.ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించండి.48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి.

Telugu Apcm, Ap, Cmjaganmophan, Godavari Floods, Ycp-Political

సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలి.రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి.అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోండి.గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం ఆదేశం.

పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో ఉంచాలని సీఎం ఆదేశం.వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశం.

కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.సెల్‌టవర్లకు డీజిల్‌ సరఫరాచేసి అవి నిరంతరం పనిచేసేలా చూడండి.

ఐదు జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులు… సీఎం ఆదేశాల మేరకు మొత్తం ఐదు వరద ప్రభావిత జిల్లాలకు 5గురు సీనియర్‌ అధికారులను సీఎస్‌ నియమించారు.అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు మురళీధర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌లను నియమించారు.ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయిప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube