ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్యాట్ వీడియో ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.ఈ వీడియోలో ఒక క్రూర జంతువు పిల్లిని చంపి తినేందుకు చాలా ప్రయత్నించింది.
కానీ ఆ పిల్లి ధైర్యంగా ప్రతిఘటించింది.చివరికి తన ప్రాణాలను రక్షించుకోగలిగింది.
వైరల్ హాగ్ షేర్ చేసిన ఈ వీడియోకి 20 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో కయోటీ ఒక పిల్లి వెంట పడటం చూడొచ్చు.
కయోటీ అనే జంతువులు తోడేలు లాగానే ఉంటాయి కానీ వాటి సైజు తక్కువగా ఉంటుంది.చెప్పాలంటే ఇవి నక్కల లాగా కనిపిస్తాయి.అయితే కయోటీలు నక్కల కంటే పెద్దగా, పొడవుగా ఉంటాయి.అయితే ఈ నక్క లాంటి జంతువు పిల్లిని చంపి తినాలనుకుంది.
ఈ క్రమంలో ఒక ఇంటిలోని వరండాలోకి పిల్లిని ఆ క్రూర జంతువు తరిమింది.అయితే దానిని నోటకరచుకుందామని అనుకునే లోపు పిల్లి ఎదురు దాడికి దిగింది.
ఆ తర్వాత అది కుర్చీ కింద నక్కింది.కానీ ఆకలితో ఉన్న ఆ క్రూర జంతువు పిల్లిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.
ఈ క్రమంలో అక్కడి నుంచి బయట పడేందుకు ఆ క్యాట్ వరండాలో ఉన్న ఒక చెక్క పైకి ఎక్కింది.అది చూడగానే ఆ నక్క పిల్లిని కరిచింది.
దాంతో ఎదురు దాడి చేసిన ఆ పిల్లి నక్కని వెనక్కి వెళ్లేలా చేసింది.ఈ గ్యాప్‌లో అది అక్కడ నుంచి సేఫ్ గా ఒక చెక్క పైకి ఎక్కింది.
చిక్కినట్లే చిక్కి ఎస్కేప్ అయిన పిల్లిని చూసి చాలా నిరాశ పడింది ఆ నక్క.కాసేపు అక్కడే తచ్చాడి ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయింది.కొద్ది సేపటి తరువాత ఆ పిల్లి కూడా పైనుంచి దూకి వేరే వైపు పారిపోయింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వామ్మో, ఒక థ్రిల్లర్ సీన్ చూసినట్లే ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ షాకింగ్ వీడియోని మీరు కూడా చూడండి.