గత కొన్నేళ్లలో సినిమా ప్రమోషన్లలో అనేక మార్పులు వచ్చాయి.సినిమాపై అంచనాలు పెరగాలనే ఉద్దేశంతో ఒక్కో స్టార్ హీరో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
అయితే మహేష్ సినిమాలను, మహేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలను నీహారిక ప్రమోట్ చేస్తున్నారు.ఎన్ ఎమ్ నీహారిక సాధారణ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు సుపరిచితమైన వ్యక్తి కావడం గమనార్హం.
ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు ఆమె గురించి, ఆమె వీడియోల గురించి బాగా తెలుసు.దక్షిణాది భాషలన్నీ సులభంగా మాట్లాడే నీహారికకు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఛాప్మన్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న నీహారిక తమిళనాట పుట్టినా బెంగళూరులో పెరిగిన అమ్మాయి కావడం గమనార్హం.నాచురల్ గా ఉండే వీడియోలు చేసే నీహారిక కొన్ని నెలల క్రితం కేజీఎఫ్2 సినిమాను ప్రమోట్ చేశారు.
తాజాగా మహేష్ బాబు, నీహారిక, అడివి శేష్ మేజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీల్ చేయగా ఆ రీల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా నీహారిక తాళాల గుత్తిని దొంగలించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.కేజీఎఫ్2 ప్రమోషన్ కోసం నీహారిక చేసిన వీడియో నెట్టింట పాపులర్ కావడంతో నీహారికకు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది.

రోజురోజుకు నీహారికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో నీహారిక యాక్టర్ గా కూడా కెరీర్ ను కొనసాగిస్తారేమో చూడాల్సి ఉంది.స్టార్ హీరోలతో వీడియోలు చేయడం ద్వారా నీహారిక అంతకంతకూ పాపులర్ అవుతున్నారు.భవిష్యత్తులో స్టార్ హీరోలు సైతం నీహారిక ద్వారా తమ సినిమాలను ప్రమోట్ చేయించుకుంటారేమో చూడాల్సి ఉంది.
సోషల్ మీడియాలో నీహారికను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.