సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట‘ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అలాగే డైరెక్టర్ పరుశురాం కూడా గీతగోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా చేయడంతో ఏ సినిమా పక్కా హిట్ అని ముందు నుండి అనుకుంటున్నారు.
అందులోను ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ లు అన్ని కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టు కున్నాయి.పోకిరి లెవల్ లో ఉంటుంది అని ముందు నుండి చెప్పడంతో ఫ్యాన్స్ సైతం భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఇలా ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చి తొలిరోజే మిశ్రమ స్పందన అందుకుంది.ఇలాంటి టాక్ కోసమే ఎదురు చూస్తున్న మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్.
సోషల్ మీడియా వేదికగా మరింత రచ్చ చేయడం మొదలు పెట్టారు.ముందే రెడీ చేసి పెట్టుకున్న మీమ్స్, ఎడిటింగ్ ఫొటోలతో ట్విట్టర్ ను ఓ రేంజ్ లో అల్లడిస్తున్నారు.

సినిమా చూసి పెడుతున్నారా.లేదంటే పెట్టాలి అని పెడుతున్నారో తెలియదు కానీ ఈ రోజు తెల్లవారు జాము నుండే #DisasterSVP హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.ఈ ట్యాగ్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతుంది.నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ఈ రేంజ్ లో వైరల్ అవుతుండడంతో ఇది పక్కా యాంటీ ఫ్యాన్స్ పనే అని అర్ధం అవుతుంది.
మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కు ధీటైన జవాబు ఇస్తున్నారు.