సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘‘గ్రామీ అవార్డ్’’ను ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లు గెలుచుకున్నారు.భారతీయ అమెరికా సంతతికి చెందిన గాయని ఫాల్గుణి షా, సంగీత దర్శకుడు రిక్కీ కేజ్.
గ్రామీలను సొంతం చేసుకున్నారు.లాస్‌వేగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యూ బాల్‌రూమ్‌లో ఘనంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిద్దరూ పురస్కారాలను అందుకున్నారు.
ఫాలూ పేరుతో ఫాల్గుణి షా స్టేజ్ షోలు నిర్వహిస్తున్నారు.‘‘ బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్’’ కేటగిరీలో ఫాల్గుణి ఆ అవార్డును గెలుచుకున్నారు.‘‘ ఎ కలర్‌ఫుల్ వరల్డ్’’ ఆల్బమ్ కోసం ఆమె గ్రామీ అవార్డ్‌కు ఎంపికయ్యారు.గతంలో భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్‌తోనూ ఫాల్గుణి కలిసి పనిచేశారు.
అంతేకాదు.బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో భారతీయ సంతతి మహిళగా గ్రామీ అవార్డు కోసం రెండుసార్లు పోటీపడిన ఏకైక మహిళగా ఫాల్గుణి నిలిచారు.
ఈ సందర్భంగా ‘‘ ఎ కలర్‌ఫుల్ వరల్డ్ ఆల్బమ్’’కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
![Telugu Colorful, Ar Rahman, Childrensmusic, Divine Tides, Grammy Award-Telugu NR Telugu Colorful, Ar Rahman, Childrensmusic, Divine Tides, Grammy Award-Telugu NR](https://telugustop.com/wp-content/uploads/2022/04/AR-Rahman-Divine-Tides-Stewart-Copeland.jpg )
ఇక రిక్కీ కేజ్ విషయానికి వస్తే.ప్రముఖ అమెరికన్ కంపోజర్ స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి ఆయన చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్.బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్‌గా అవార్డు గెలుచుకుంది.
పురస్కారాన్ని అందుకున్న అనంతరం రిక్కీ స్టేజ్ మీద నుంచే ‘నమస్తే’ అంటూ అక్కడ ఉన్నవారందరికీ నమస్కరించారు.తాను అవార్డు అందుకున్న ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆయన.‘‘డివైన్ టైడ్స్ ’’ ఆల్బమ్‌కు గ్రామీ పొందడం ఎంతో సంతోషంగా వుందన్నారు.స్టీవర్ట్ కోప్లాండ్‌కు ఇది ఆరో గ్రామీ అయితే తనకు ఇది రెండోది ’’ అని రిక్కీ వెల్లడించారు.
అమెరికాలో పుట్టి పెరిగిన రిక్కీ చాలా ఏళ్ల క్రితమే భారత్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.ప్రస్తుతం ఆయన కర్ణాటకలో నివసిస్తున్నారు.