బాలీవుడ్ ను హడలిస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. అక్కడి వారికీ హార్ట్'ఎటాక్' తెప్పిస్తుందిగా..

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

 Rrr Movie Mania In Bollywood Details, Rrr, Ntr, Ram Charan, Rajamouli, Bollywood-TeluguStop.com

ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.ఈయన మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు మార్చేశాడు.

దేశం మొత్తం మన సినిమాల వైపే చూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మన సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద విలవిలా లాడిపోతున్నాయి.

ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఆసక్తి చూపని అక్కడి ప్రేక్షకులు సైతం మన సినిమాల కోసం ఎదురు చుస్తున్నారు.మన సినిమాల రిలీజ్ డేట్ లను చూసి హిందీ మేకర్స్ వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్ లను మార్చుకుంటున్నారు.

ఎందుకంటే సౌత్ సినిమాలతో పోటీగా వస్తే అవి మన ధాటికి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి.అయితే ఇలా మన సౌత్ మూవీలు వాళ్ళ సినిమాలపై ఆధిపత్యం చెలాయించడం వాళ్లకు మింగుడుపడని విషయంగా మారింది.

Telugu Attack, Bollywood, John Abraham, Pushpa, Rajamouli, Ram Charan, Rrr Mania

ఇంతకు ముందు 83 సినిమా పుష్ప ధాటికి నిలవలేక పోయింది.ఇక కెజిఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమా వస్తుందని తెలిసి లాల్ సింగ్ చద్దా వెనక్కి తగ్గింది.

ఇక ఇప్పుడు దేశమంతటా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా నడుస్తున్న విషయం తెలిసిందే.విడుదల వరకు టెన్షన్ పెట్టిన కూడా ఆ తర్వాత మాత్రం అక్కడ కూడా తన మ్యానియా చూపిస్తూ ఆరు రోజుల్లోనే నార్త్ లో 120 కోట్లకు పైగా వసూళ్లు చేసి దూసుకు పోతుంది.

Telugu Attack, Bollywood, John Abraham, Pushpa, Rajamouli, Ram Charan, Rrr Mania

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రభావాన్ని కూడా ఈ సినిమా తగ్గించింది.ఇప్పుడు కొత్తగా రావాలి అనుకునే సినిమాలపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.ఈ రోజు జాన్ అబ్రహం స్వీయ నిర్మాణంలో రూపొందిన ఎటాక్ సినిమా రిలీజ్ అవ్వనుంది.అయితే ఈ సినిమాకు ఆర్ ఆర్ ఆర్ హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది.

మొన్నటి వరకు ధైర్యంగానే కనిపించిన ఇప్పుడు మాత్రం ఈ సినిమ మెజారిటీ జనాలు ఆర్ ఆర్ ఆర్ ను ఇష్టపడుతుంటే ఈ సినిమా మేకర్స్ ను కలవరపాటుకు గురిచేస్తుందట.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు.

మొదటి వారం నెట్టుకొచ్చిన రెండవ వారం మాత్రం కష్టమే అంటున్నారు క్రిటిక్స్.మరి మన సినిమా మ్యానియా ఎప్పటి వరకు చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube