యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటించిన RRR సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా కోసం చిత్రబృందం ఎన్టీఆర్ రామ్ చరణ్ గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్ట పడ్డారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ కు తన కెరియర్ లో తాను నటించిన సినిమాలలో ఏదైనా సీక్వెల్ చేయాలని ఉందా? ఉంటే ఏ సినిమాని సీక్వెల్ చేస్తారు? అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తనకు అదుర్స్ సినిమా సీక్వెల్ చిత్రం చేయాలని ఉంది అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.
ఈ సినిమాను డైరెక్టర్ వి.వి.వినాయక్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఎన్టీఆర్ కు ఒక హిట్ సినిమా అందించారు.

ఇక గతంలో వి.వి.వినాయక్ మాట్లాడుతూ అదుర్స్ సినిమా సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయని, కథ సిద్ధమైతే తారక్ తో సినిమా చేయడమే ఆలస్యం అని వివి వినాయక్ గతంలో వెల్లడించారు.ఇలా గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇటు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలతో బిజీగా ఉండి పోయారు .అలాగే వివి వినాయక్ కూడా ఈ సినిమా గురించి ఏమాత్రం ప్రస్తావించక పోవడంతో ఈ సినిమా పూర్తిగా పక్కన పెట్టారు.అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రస్తావించడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి వినాయక్ ఏమైనా ఆలోచన చేస్తారేమో తెలియాల్సి ఉంది.