మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25, 2022 న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా తో చరణ్ రేంజ్ మారి పోబోతుంది.పాన్ ఇండియా స్టార్ గా రెట్టింపు ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమా మరొక వారం రోజుల్లోనే రిలీజ్ కానున్న క్రమంలో ఈ సినిమా ప్రొమోషన్స్ లో టీమ్ మొత్తం బిజీగా ఉంది.
ప్రెసెంట్ ఈ సినిమా ప్రొమోషన్స్ జోరుగా చేస్తున్నాడు జక్కన్న.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే చరణ్ మరొక సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.

శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా తెరకెక్కుతుండగానే మరొక సినిమా కూడా ఓకే చెప్పేసాడు.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ గా తెరపైకి రానుంది.
తాజాగా చరణ్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సముద్రఖని కి రామ్ చరణ్ అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈయన దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్ గా మారిపోయాడు.ఈయన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

ఈయన తమిళ్ లో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాను పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు.ఆ సినిమాకు కూడా సముద్రఖని నే దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి.అదే నిజమైతే బాబాయ్, అబ్బాయి ఇద్దరు కూడా ఈయన దర్శకత్వంలో నటించనున్నారు.మరి ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.