భారీ అంచనాల నడుమ విడుదలైన రాధేశ్యాం సినిమా వసూళ్ల విషయంలో బయ్యర్లు మరియు నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా ఇప్పటికీ వంద కోట్ల వసూళ్ల కు చేరువ అయింది.
కాని షేర్ విషయం చాలా నిరాశగా ఉంది.సినిమా ఇప్పటి వరకు కేవలం 30 శాతం షేర్ వసూళ్లు మాత్రమే దక్కించుకుందని బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 70% వసూళ్లు నమోదు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరీ ఈ స్థాయిలో బొక్క బోర్లా పడుతుందని అనుకోలేదు అంటూ ప్రభాస్ అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా కనీసం 50% వసూళ్లు అయినా సాధిస్తుందా అంటూ ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు రాధాకృష్ణ తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను ప్రమోట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ వారి ప్రయత్నాలు సఫలం అయ్యే పరిస్థితి కూడా కనబడడం లేదు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉంది.ఆదివారం తర్వాత అంటే నేటి నుండి వసూలు మరింతగా డౌన్ అవుతాయి అనే టాక్ వినిపిస్తోంది.
అదే కనుక నిజమైతే ఈ సినిమా 50 శాతం వసూలు దక్కించుకోవడమే గొప్ప విషయం అంటూ సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ సినిమా కు ఈ స్థాయి లో దారుణమైన వసూళ్లు నమోదు అవుతాయని కలలో కూడా ఊహించలేదు అంటూ కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ స్థాయిలో సినిమా తీవ్ర నిరాశ పరుస్తుంది అని సినీ విశ్లేషకులు కూడా ఊహించలేదు.ముఖ్యంగా హిందీ వర్షన్ వసూళ్లు చూస్తుంటే అభిమానులకు రక్త కన్నీరే మిగిలింది.