టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రకుల్ ప్రీత్ సింగ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది అలాగే తెలిసిందే.
రకుల్ ఎప్పటి కప్పుడు తన సినిమాలకు సంబంధించి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.రకుల్ ప్రీత్ సింగ్ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లను తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం తన ప్రియుడు జాకీ భగ్నాని తో కలసి ఆగ్రాకు వెళ్ళింది.అయితే ఈ జంట ఆగ్రా కు వెళ్ళడానికి గల కారణం కూడా లేకపోలేదు.
ప్యార్ కా పంచ్ నామా డైరెక్టర్ లవ్ రంజన్ వివాహ వేడుకకు హాజరయ్యింది.వివాహం సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడితో కలసి తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో ఉన్న అందాలను చూస్తూ ఎంజాయ్ చేసింది.
హిప్పీ-చిక్ యెల్లో ఔట్‌ఫిట్ హాఫ్ శౌల్డర్ మిర్రర్ బ్లౌజ్, ఘాగ్రా, వేలాడు తున్న హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్‌లో దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాస్తు శిల్పం కాదు కానీ చక్రవర్తుల అభిరుచి సజీవ రాతితో చెక్కబడింది.
తాజ్మహల్ నేపథ్యంలో అంటూ ఫోటో క్యాప్షన్ ని కూడా జోడించింది రకుల్.ఇకపోతే రకుల్ సినిమాల విషయానికి వస్తే.
ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
డాక్టర్ జి, అటాక్ సినిమాలతోపాటు గా మరొక నాలుగు హిందీ సినిమాలు కూడా చేస్తోంది.ఇవన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రకుల్ ప్రీత్ సింగ్ తనకు సమయం దొరికినప్పుడల్లా తన ప్రియుడితో కలిసి వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ అందుకు సంబందించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.