ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి ఒక వెలుగు వెలిగిన హీరోల గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఉదయ్ కిరణ్ పేరు వస్తుంది.ఎందుకంటే ఒక సాదాసీదా హీరో గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లవర్ బాయ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇక కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చాడు అని చెప్పాలి.ఇక పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఉదయ్ కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సాధించింది.
దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ వైపు మళ్ళింది.యువ హీరోతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు అందరూ కూడా క్యూ కట్టారు.
ఇలా ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆయనపై ఎన్నో రూమర్లు వచ్చాయి.కొన్ని రూమర్లు ఉదయ్ కిరణ్ కెరీర్ ను దెబ్బతీస్తాయి కూడా.
మరి ఉదయ్ కిరణ్ పై వచ్చిన రూమర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అటు ఉదయ్ కిరణ్ కి ఇటు దర్శకుడు తేజ కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.ఈ సినిమా విడుదలైన తర్వాత డైరెక్టర్ తేజ కి ఉదయ్ కిరణ్ కు మధ్య గొడవలు జరిగాయి అంటూ పుకార్లు షికారు చేశాయి.
ఇక ఆ తర్వాత ఈ సినిమా వంద రోజుల వేడుక కూ ఉదయ్ కిరణ్ ఆలస్యంగా రావడంతో నిజంగానే దర్శకుడితో ఉదయ్ కిరణ్ కు గొడవలు ఉన్నాయి అంటూ మరింత ప్రచారం జరిగింది.
ఇక ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం కలుసుకోవాలని. ఇక ఈ సినిమా విషయంలో టాలీవుడ్ పెద్ద చర్చ జరిగింది.ఈ కథ నచ్చలేదని కథలో మార్పులు చేయాలని ఉదయ్ కిరణ్ చెప్పారని.
ఇష్టం లేకపోయినప్పటికీ దర్శకుడు కృష్ణ వంశీ కథలో మార్పులు చేశాడని.ఇక ఉదయ్ కిరణ్ తీరుతో అటు నిర్మాతలు కూడా కొంత ఇబ్బంది పడ్డారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
దీంతో ఎంతో మంది నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాకు కాస్త వెనకడుగు వేశారు.
ఇక వరుస విజయాలతో ఉదయ్ కిరణ్ ఎదుగుతున్న సమయంలోనే మరి కొన్ని పుకార్లు తన కెరీర్ను చుట్టుముట్టాయి.కథ విషయంలో ఉదయ్ కిరణ్ అతిగా జోక్యం చేసుకుంటున్నారని అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై స్పందించిన ఉదయ్ తన సినిమా బాగుండాలని తపనతోనే కాస్త మార్పులు చేయాలని చెబుతున్నానని అందులో తప్పేముంది అంటూ మీడియాకు వివరణ కూడా ఇచ్చారు.
ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న ఉదయ్ కిరణ్ కెరీర్ మొదటి నుంచి పుకార్లు దాడి చేశాయని చెప్పాలి.తర్వాత కాలంలో ఈ ఎన్ని సినిమాలు చేసినా ఆడకపోవడంతో చివరికి మనస్తాపం చెంది ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.