ముందస్తు ఎన్నికలపై మొదలైన ప్రచారం... అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతలా రోజురోజుకు సరి కొత్త మలుపులతో ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుండే అనధికారికంగా ఎన్నికల వాతావరణం నెలకొంది.

 The Campaign That Started On The Early Elections This Is The Real Strategy Detai-TeluguStop.com

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఒక్కసారిగా దేశపు మీడియా చూపు తెలంగాణపై పడింది.అయితే గత ఎన్నికల లాగే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైన విషయం తెలిసిందే.

అంతేకాక కేసీఆర్ కదలికలు కూడా అలాంటి వార్తలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా బహిరంగంగానే ముందస్తు ఎన్నికలపై కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే కెసీఆర్ ఇంతకు ముందు జరిగిన విలేఖరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చినా మరల కెసీఆర్ నుండి ప్రతిపక్షాలు ఊహించని మలుపులను వెలువడుతున్న నేపథ్యంలో ముందుగానే ఇటు ప్రజల్లోకి ఒక వ్యూహం ప్రకారమే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అనే వాదనని తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రతిపక్షాల ముందస్తు ఎన్నికలపై మరల కెసీఆర్ నుండి ఎటువంటి  స్పందన రానటువంటి పరిస్థితి ఉంది.

టీఆర్ఎస్ ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు చేయించుకున్న నేపథ్యంలో ఎంత వరకు ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందనే దానిపై ఒక స్పష్టమైన క్లారిటీకి ఇప్పటికే వచ్చారు.ముందస్తు ఎన్నికలపై ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ కు కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.అయితే కెసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో దేనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం రంజుగా మారే అవకాశాలు వందకు వంద శాతం కనిపిస్తున్నాయి.

The Campaign That Started On The Early Elections This Is The Real Strategy Details, Telangana Congress, Kcr, Telangana Early Elections, Cm Kcr, Trs Party, Telangana General Elections - Telugu @cm_kcr, @telanganacmo, Cm Kcr, Revanth Reddy, Telangana, Trs

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube