సాధారణంగా సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి తరుణంలో కొంతమంది సెలబ్రిటీలు సదరు నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇవ్వగా మరికొందరు మాత్రం అలాంటి కామెంట్లు ఏ మాత్రం పట్టించుకోరు.అయితే తాజాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్ లను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఎదుర్కొన్నారు.
ఇరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూతురు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇరా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గతంలో తనకు మానసిక రుగ్మతలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈ విషయాల గురించి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోపై బీ-టౌన్ సింగర్ సోనా మొహపాత్ర ‘‘గుడియా, డాలీ’’(బొమ్మ లా ఉన్నావ్) అంటూ కామెంట్ చేసింది.
ఈ విధంగా సోనా తన గురించి కామెంట్ చేయడంతో ఒక నెటిజన్ కామెంట్ కి స్పందిస్తూ దారుణంగా అమీర్ ఖాన్ కూతురును ట్రోల్ చేశాడు.
ఈ క్రమంలోనే నెటిజెన్ స్పందిస్తూ… “ఇరా మొహం నీకు బొమ్మలా కనిపిస్తుందా ఆమె ముసలిది అయిపోయింది.ఆమె కళ్ళ కింద మొత్తం ముడతలు వచ్చాయి.పంది లాంటి ముఖం తనది!’’ అని కూడా అన్నాడు.
ఇరా గురించి దారుణంగా కామెంట్స్ చేయడంతో సింగర్ సోనా నెటిజన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.నీకు ఎలాంటి పని పాట లేదు నీ జీవితం అంతా ఓటమే అలా ఓడిపోవడం వల్ల ఆ విస్మయాన్ని మొత్తం ఇలా విషంలా వెళ్లగక్కుతున్నావు వెళ్లి ఏదైనా పని చేసుకో అంటూ నెటిజన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.