ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో దాదాపు అందరినీ ఏదో ఒక సమయంలో జలుబు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
వాతావరణంలో వచ్చే మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అయితే కారణం ఏదైనా జలుబుకు గురైనప్పుడు కొన్ని కొన్ని ఆహారాలను తీసుకోరాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఆ ఆహారాలు ఏంటీ.? వాటిని ఎందుకు తీసుకోరాదు.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు చేసినప్పుడు తినకూడని ఆహారాల్లో వైట్ రైస్(అన్నం) ఒకటి.
అన్నంకు, జలుబుకు సంబంధం ఏంటీ అనేగా మీ సందేహం.వాస్తవానికి అన్నం శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
అందు వల్ల వైట్ రైస్‌ను తింటే కఫం మరింత పెరిగి జలుబు ఇంకా తీవ్ర తరంగా మారుతుంది.అందుకే జలుబు ఉన్నప్పుడు అన్నం తినకూడదని నిపుణులు అంటున్నారు.
అలా అని అన్నంను పూర్తిగా మానేస్తే నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి.కాబట్టి, రాత్రి పూట మాత్రం వైట్ రైస్‌ను మానేసి దానికి బదులుగా చపాతీలను తీసుకుంటే జలుబు త్వరగా తగ్గు ముఖం పడుతుంది.
ఇక అన్నంతో పాటు మరికొన్ని ఆహారాలను కూడా తీసుకోరాదు.అవేంటో కూడా చూసేయండి.
గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ జలుబు చేసినప్పుడు దానికి దూరంగా ఉండటమే మంచిది.గుడ్డులో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచి ముక్కు రంద్రాలను మూసుకు పోయేలా చేస్తాయి.దాంతో ఊపిరి సరిగ్గా అందక పోవడం, ఛాతిలో నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అలాగే జలుబు చేసినప్పుడు టమాటోలు, పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలు, షుగర్ వంటి వాటిని సైతం తీసుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.