ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తహ తహ లాడుతోంది.రాబోయే ఉగాది నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలనే పట్టుదలతో ఏపీ సీఎం జగన్ ఉన్నారు.
ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం 13 జిల్లాలు ఏపీలో ఉండగా, మరో 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదల అయింది.ఏపీ లో ఉన్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది.
దీనిని ఇప్పుడు అమలులోకి తీసుకొస్తున్నారు.ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లని ఉంచారు.
ఇప్పుడు కొత్తగా మన్యం , అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్య సాయి, కాకినాడ, అన్నమయ్య శ్రీ బాలాజీ జిల్లాలు.అలాగే పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఉండబోతుంది.
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేస్తున్నారు.అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా ఏర్పాటవుతోంది.
అదేవిధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు.ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా నరసరావుపేట కేంద్రంగా పలనాడు జిల్లా, నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అలాగే రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది .అలాగే ఇప్పటివరకు కాకినాడ కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాను ఇకపై రాజమహేంద్రవరం కేంద్రంగా ఉంటుంది.ఏలూరు కేంద్రంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఉంటుంది.దీనిపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.30 రోజుల్లోగా దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే అధికారులు స్వీకరిస్తారు.