మంత్రి కొడాలి నాని తీరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆ పార్టీ నేత సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు.కొడాలి నానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.72 గంటల్లో మంత్రి నానిపై చర్యలు తీసుకోకపోతే.తామే వైసీపీని బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
సుబ్బారావు గుప్తా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గుడివాడలో 2024లో నేను పోటీ చేస్తా.
’’ అని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు కొడాలి నాని మాటతీరు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని.పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఆయన శైలి ఉందని సుబ్బారవు గుప్తా విమర్శించారు.
ఓటేయాలంటేనే బాధపడే పరిస్థితికి తీసుకొస్తున్నారని సుబ్బారావు గుప్తా ఆక్షేపించారు.నేను వైసీపీ కార్యకర్తనే.
కొడాలి నాని ప్రెస్ ముందుకొస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నారు.
ఇంట్లో ఆడోళ్ల గురించే కాకుండా.
కాపు, కమ్మ అంటూ కులాలు, మతాలు గురించి అన్నీ చెబుతున్నారు.అది కరెక్ట్ కాదు! కొడాలి నాని.
నీ భాష వల్ల, నీ భావాల వల్ల, నీ దమ్ము వల్ల వైఎస్సార్ ఓట్లు రోజూ పోతున్నాయి.ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు.
పార్టీ కార్యకర్తలందరి తరఫున మాట్లాడుతున్నా.నీ వల్ల రెడ్లు, కమ్మ అందరూ బాధపడుతున్నారు.
కులాల పేరుతో తెగ తిడుతున్నారు.నువ్వు సింహాల దాడి చూశావ్.
తోడేళ్ల దాడి చూస్తావ్ నాని! తోడేళ్ల దాడి ఎలా ఉంటుందో తెలుసా.పీక్కు తిని పోతుంటాయి.
వైసీపీ కార్యకర్తలు నీపై దాడి చేస్తే అలా ఉంటుంది.
నీ వల్ల వైసీపీ ఓట్లన్నీ పోతున్నాయి.ఏం చేయాలి? జగనన్న నువ్వన్నా కళ్లు తెరువన్నా.నువ్వు కళ్లు తెరవకపోతే, మేమంతా కళ్లు మూసుకుని వేరే రాష్ట్రాలకు పారిపోవాల్సి వచ్చేలా ఉంది.
పార్టీలో ఉండి మేమేం చేయాలి.కొడాలి నానిని కంట్రోల్ చెయ్ అన్నా.
ఒకవేళ కంట్రోల్ చేయలేకపోతే.ఒక పని చెయ్.
రాష్ట్రంలో లా అండ్ సరిగ్గా లేదు కదా.ఆయనకు హోం మంత్రి పదవి ఇవ్వు.బాగా చేస్తాడు! లేకపోతే బూతుల శాఖ ఇవ్వు.తెలుగు దేశం వాళ్లు అలా చేస్తేనే కదా.వాళ్లను ప్రతిపక్షంలో కూర్చోపెట్టింది.అని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు
.