వైరల్: పంది వేసిన పెయింటింగ్ కు ఏకంగా 20 లక్షలా..?!

పెయింటింగ్స్ వేయడం అంటే చాలా మంది ఇష్టపడతారు.కానీ పెయింటింగ్ వేయడం అనేది ఒక ఆర్ట్ అది అందరి వల్లా కాదు.

 Viral: 20 Lakhs For A Pig Painting, Viral Latest, News Viral, Social Media, Pig,-TeluguStop.com

కానీ ఈ పంది మాత్రం చకచకా పెయింటింగ్స్ వేసేస్తుంది.అందరి అంచనాలను తారుమారు చేస్తూ రకరకాల పెయింటింగ్స్ వేస్తుంది.

ఈ పంది బ్రష్ పట్టిందంటే చాలు క్షణాల్లో కాన్వాసు అంతా రంగులమయం అయిపోతుంది.మీకు  ఇంకో విషయం కూడా చెప్పాలండోయ్.

ఈ పంది వేసే పెయి టింగులకు డిమాండ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది.పెయింటింగ్స్ అనే మాట వింటే చాలు మన అందరికి గుర్తుకు వచ్చే పేరు పికాసో.

అలాగే ఈ పంది వేసే పెయింటింగులకు స్ఫూర్తి కూడా ఆయనే అన్నట్టు ఉంటుంది.ఈ పందికి పేరు కూడా ఉందండోయ్.

దీనిని అందరూ ‘పిగ్‌కాసో’.అని అంటారు.

సౌతాఫ్రికాలో ఈ పిగ్ కాసో పెయింటింగ్స్ హల్చల్ చేస్తున్నాయి.ఈ పందిని జువానే లెఫ్‌సన్‌ అనే మహిళ కాపాడింది.

ఎలాగంటే.ఈ పంది చిన్నగా ఉన్నప్పుడు దాని యజమాని దీన్ని ఓ మటన్‌ అమ్మే వ్యాపారికి అమ్మేశారట.అయితే పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ స్థానికంగా ఒక ఫామ్ శాంక్చ్యూరీ నిర్వహిస్తోంది.ఆమెకు జంతువలంటే ఎనలేని ప్రేమ.

ఈ క్రమంలోనే 2016లో జంతు వధశాలలో ఆ పందిని చూసిన ఆమె దానిని రక్షించి తాను నిర్వహిస్తున్న శాంక్చ్యూరీని తీసుకొచ్చి ప్రేమగా పెంచుకుంటున్నారు.అదే సమయంలో తన షాపులో కింద పడి ఉన్న పెయింట్‌ బ్రష్షు పట్టుకుని దానికి నచ్చిన విన్యాసాలు చేస్తుంటే అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన నుంచే పుట్టిందే ఈ పిగ్‌కాసో.ఆ పంది నోట్లో బ్రష్ పెట్టి దాని ముందు ఒక కాన్వాసు కూడా రెడీ చేసి రంగులు కూడా సిద్ధం చేసి పెట్టారు.

వాటిని చుసిన పంది తన నోటితో బ్రష్ పట్టుకని రంగులలో ముంచి కాన్వాయి మీద బొమ్మలు గీయడం ప్రారంభించింది.

ఇక అప్పటినుంచి ఆ పందికి బొమ్మలు గీయటమే పనిగా ఉంటోంది.ఆ పంది వేసిన బొమ్మలు బాగున్నాయని కొంతమంది అనటంతో వాటిని అమ్మే ఆలోచన చేసి వాటిని అమ్మకానికి పెట్టగా వాటిని కొనటం మొదలుపెట్టారు.

అలా ప్రారంభమైంది పిగ్ కాసో బొమ్మల అమ్మకం ప్రస్థానం.తరువాత ఓ వెబ్ సైట్ ఓపెన్ చేసి పంది గీసిన బొమ్మలను అందులో పోస్టు చేసి వేలం పెట్టగా ఆ బొమ్మలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఆ బొమ్మల్ని వేలం వేయటం మొదలు పెట్టారు.జర్మనీకి చెందిన పీటర్‌ ఎసర్‌ అనే వ్యక్తి పిగ్ కాసో వేసిన ఓ పెయటింగ్ ను ఏకంగా రూ.20 లక్షలకు పైగా చెల్లించి మరి వేలంలో ఈ పెయింటింగ్‌ ను దక్కించుకున్నారు.ఇంకో విశేషం ఏంటంటే జంతువులు వేసిన పెయింటింగ్ లో ఎక్కువ ధర పలికిన చిత్రం ఇదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube